Friday, May 17, 2024
- Advertisement -

ఇర‌కాటంలో టీడీపీ…రాజీనామాకు సిద్ద‌ప‌డ‌తారా….?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక తాజాప‌రిణామాల‌తో టీడీపీ ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది.శిల్ప చ‌క్ర‌పాణి వైసీపీ తీర్థం పుచ్చుకుంటుండ‌టంతో బాబుకు ఇబ్బందిగా మారింది.పార్టీ మారుతూ పార్టీకి భ‌లే షాక్ ఇచ్చారు.పార్టీకి రాజీనామ చేశారు కాని ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు.

అయితే ట్విస్ట్ అంతా ఇక్క‌డ‌నేఉంది.ఎమ్మెల్సీకి రాజీనామ చేయ‌లేద‌ని మీడియాముందు ప్ర‌క‌టించినా టీడీపీ నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు.పైగా ‘ఎంఎల్సీ రాజీనామా పత్రం తన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను, మీరు రాజీనామా చేయండి నేను రాజీనామా చేస్తాను’ అని సవాలు చేసినా కనీసం స్పందించటం లేదు. ఇపుడిదే విషయం నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాల విషయంలో చక్రపాణి సవాలుకు ఫిరాయింపు మంత్రి, ఎంఎల్ఏలు స్పందిస్తారా లేదా అన్నది ఆశక్తిగా మారింది

వైసీపీ నుండి గెలిచిన వారి చేత రాజీనామా చేయించకుండానే చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కుని మంత్రిప‌దువులు ఇచ్చారు. అదే ఇప్పుడు బాబును ఇర‌కాటంలే ప‌డేసింది. అందుకే, ఇపుడు చక్రపాణి రాజీనామాను వారెవరూ ప్రశ్నించలేకున్నారు. ఒకవేళ చక్రపాణిని రాజీనామా చేయమని టిడిపి వాళ్లెవరైనా అడిగితే వెంటనే ఫిరాయింపుల రాజీనామాల అంశం ప్రస్తావనకు వస్తుంది. ఈవిష‌యంలో బాబుతోపాటు ఇత‌ర నాయులు ఎవ‌రూ మాట్లాడ‌లేని ప‌రిస్థితి

ఇత‌ర పార్టీల వారు చేసిన వ్యాఖ్య‌లుపై ఘాటుగా స్పందించె నాయ‌కుల ఇప్పుడు శిల్పా స‌వాల్ పై తేలుకుట్టిన దొంగ‌ల్లా ఒక్క మాట‌కూడా మాట్లాడ‌లేదు. పార్టీ మార‌డాల‌పై కి టిడిపి నోరు మూయించేందుకు చక్రపాణి భలే ఎత్తేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు . భ‌విష్య‌త్తులో టీడీపీనుంచి ఎవ‌రు పార్టీమారినా నోరెత్త‌లేని ప‌రిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -