Friday, May 17, 2024
- Advertisement -

జగన్‌ని అనుసరించడం తప్ప గత్యంతరం లేదుః బాబుతో టిడిపి ఎంపిలు

- Advertisement -

నలభై ఏళ్ళ అనుభవజ్ఙుడైన నాయకుడు….ఆ అనుభవం పేరు చెప్పి ప్రచారం చేసుకునే 2014లో అధికారంలోకి వచ్చాడు…….చంద్రబాబుకి మద్దతివ్వడానికి పవన్‌కి కూడా ఆ అనుభవం తప్ప మరో కారణం లేకుండా పోయింది……ఎన్నికల తర్వాత కూడా నా అనుభవం అంత వయసులేదు అని జగన్‌ని ఎన్నో సార్లు ఎద్దేవా చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన అన్ని విషయాల్లోనూ అదే జగన్‌ని అనుసరించాల్సిన అగత్యం మాత్రం చంద్రబాబుకు తప్పడం లేదు. జగన్ చెప్తే నేను వినాలా అని చెప్పి ప్యాకేజ్‌కి ఒకే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో అతి పెద్ద విలన్‌గా నిలిచిన చరిత్ర చంద్రబాబుది.

అందుకే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ జగన్‌ని అనుసరించడం మొదలెట్టాడు. ఇప్పటికే అవిశ్వాసంతో సహా జగన్ విధానాలను కాపీ కొడుతున్న చంద్రబాబుకు ఇఫ్పుడు మరో అగత్యం కూడా తప్పేలా కనిపించడం లేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంపి పదవులకు రాజీనామా చేసిన వైకాపా ఎంపిలు..ఆ వెంటనే నిరాహారదీక్షకు కూర్చున్నారు. అయితే టిడిపి ఎంపిలు మాత్రం ఎంచక్కా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బాబు ఆదేశాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కింకర్తవ్యం అని టిడిపి ఎంపిలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర కూడా ఇప్పుడు సమాధానం లేదు. రాజీనామాలు తప్ప మరో గత్యంతరం లేదని జేసీ దివాకరరెడ్డి లాంటి ఎంపిలు బాబు మొహం మీదనే చెప్పేస్తున్నారు. రాజీనామాలు చేయకుండా ఢిల్లీలోనే ఉండి పోరాటం చేయడం అనేది ఏం ఉంటుందని ఇతర ఎంపిలు కూడా బాబును ప్రశ్నిస్తున్నారు. జగన్‌ని కాపీ కొట్టాం అన్న అపప్రధ మూటకట్టుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతో రాజీనామాలు చేయకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో విభజన సమయంలో సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలా, కాంగ్రెస్ ఎంపిల్లా మనం కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుందని బాబును హెచ్చరించారు ఎంపిలు. రాజీనామాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యకు వచ్చి ఆందోళనల్లో పాల్గొంటామంటే ప్రజలు నిలదీయడం ఖాయం అన్న తమ భయాన్ని బాబుకు చెప్పుకొచ్చారు టిడిపి ఎంపిలు. అసలు రాజీనామాలు చేయకుండా ఉండడం కంటే……రాజీనామాలు చేసి వైకాపా ఎంపిల కంటే తామే గొప్ప అని నిరూపించుకోవడం సులభం అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు టిడిపి ఎంపిలు. ఇప్పుడు ఇదే విషయంపై చంద్రబాబు తన సన్నిహితులతో చర్చలు నడుపుతూ ఉన్నాడని….ఫైనల్‌గా టిడిపి ఎంపిలు కూడా రాజీనామా చేయడం ఖాయం అన్న అభిప్రాయాన్ని టిడిపి సీనియర్ నేతలే చెప్పుకొస్తున్నారు. రాజీనామాల విషయంలో వెనక్కితగ్గితే మాత్రం ఎన్ని ప్రచార జిమ్మిక్కులు చేసినా……బిజెపితో ముడిపెట్టి జగన్‌పై ఎంత విష ప్రచారం చేసినా ప్రజల ముందు దోషులు నిలబడాల్సిన పరిస్థితి టిడిపికే ఉంటుందని ఆ పార్టీ నాయకులు విస్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -