Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీ రేటు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్లు!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనేమో తన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారంతా సంతలో పశువుల్లా అమ్ముడు పోతున్నారు అన్నాడు. ఏపీలో మాత్రం అలాంటి పశువులను తనే కొన్నాడు. ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను కొన్న ఘనత చంద్రబాబు నాయుడుదే. ఈ విషయంలో సందేహాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని ఫిరాయింపుదారులే చెప్పారు. ఆ మధ్య ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనేం చంద్రబాబు మీద ప్రేమతో టీడీపీలో చేరలేదని అనుచరవర్గం ముందు కుండబద్ధలు కొట్టింది.

తనకు మంత్రి పదవిని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడని, కాంట్రాక్టు పనులు ఇస్తామని చెప్పారని అందుకే తను తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా ఆమె ఘనంగా ప్రకటించుకుంది. ఒకవైపు డెవలప్ మెంట్ కోసమే టీడీపీలోకి అని మీడియా ముందు చెప్పి.. అనుచవర్గం ముందు ఆమె అసలు కథను బయటపెట్టింది. ఈ విధంగా ఎమ్మెల్యేల ఫిరాయింపు పరమార్థం వివరించింది ఆమె. ఆమె మాత్రమే కాదు.. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోయిన వారే అనేది జనాభిప్రాయం.

తాజాగా పూతలపట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తనను తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది అని తెలిపారు. తనకు నలభై కోట్ల రూపాయల మొత్తాన్ని ఆఫర్ చేశారని కూడా ఈ ఎమ్మెల్యే చెప్పాడు. టీడీపీలో చేరితే ఆ మేరకు లబ్ధి కలిగిస్తామని.. ఒకవేళ టీడీపీలో చేరకపోతే తనపై కేసులు కూడా బనాయిస్తామని తెలుగుదేశం పార్టీ పెద్దలు హెచ్చరించారని ఈ ఎమ్మెల్యే చెప్పాడు.

అయితే తను ఆ బెదిరింపులకు తలొగ్గలేదని.. తను జగన్ తోనే నిలిచానని, నిలుస్తానని ఈ ఎమ్మెల్యే స్పష్టం చేశాడు. ఈ ఎమ్మెల్యే మాటలను బట్టి తెలుగుదేశం పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు నలభై కోట్ల రూపాయల వరకూ వెచ్చించిందని స్పష్టం అవుతోంది. ఎమ్మెల్యే రేటును ఈ స్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -