చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం వద్ద వైసిపి – టిడిపి నాయకులు ఘర్షణకు దిగారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం తోపులాటకి దారి తీసింది. నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాకుండానే పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైసిపి నాయకులు ప్రయత్నించగా… టిడిపి నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం గొడవకు కారణమైంది.
నామినేషన్ల ఉపసంహరణలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దాడికి దిగిన ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం వైసిపి సొంతమైంది. ఇక్కడి 31 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ప్రత్యర్థుల నామినేషన్‌లు లేకపోవటంతో పుంగనూరు పురపాలక సంఘం వైసిపికి ఏకగ్రీవమైంది.
పలమనేరు పురపాలక సంఘంలోని 26 వార్డుల్లో 18 వార్డులు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. నగరి పురపాలక సంఘం పరిధిలోని 29 వార్డుల్లో 7వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 6వార్డులు వైసిపి అభ్యర్థులు, 1వార్డు టిడిపి అభ్యర్ధికి ఏకగ్రీవమైంది. మిగిలిన 22వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !