Friday, May 3, 2024
- Advertisement -

ఏపి ఎన్నికలలో కొత్త ట్విస్ట్.. నిలిపివేసిన హై కోర్టు..!

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా… తిరుపతి, రాయచోటి, ఎర్రగుంట్ల, పుంగనూరులో మళ్లీ నామినేషన్లకు అవకాశమిస్తూ ఎస్​ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. గతేడాది స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో.. వైకాపా నేతల దౌర్జన్యాలు, బెదిరింపుల వల్ల నామపత్రాలు సమర్పించలేకపోయామని గతంలో కొందరు చేసిన విజ్ఞప్తి మేరకు.. ఆయా చోట్ల మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్​ఈసీ అవకాశమిచ్చింది.

ఈ విషయమై పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు.. ఎస్​ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం వెలువరించింది.పుర ఎన్నికల్లో వాలంటీర్ల ఫోన్​లు స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సైతం హైకోర్టు నిలుపివేసింది. వాలంటీర్ల నుంచి ఫోన్​లు స్వాధీనం చేసుకోవద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వార్డు వాలంటీర్ల నుంచి ఫోన్​లు స్వాధీనం చేసుకోవాలని ఎస్​ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.ఈ మూడు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేసింది. అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే పథకాల ప్రయోజనాలను నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికలతో వాలంటీర్ల కు సంబంధం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం వాలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

వామ్మో.. రాణికెట్‌ వ్యాధితో 4వేల నాటుకోళ్లు మృతి!

కర్ణాటక మంత్రి శృంగార లీలలు.. సోషల్ మీడియాలో వైరల్!

తిరుపతి ఉప ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్న వైసీపీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -