Monday, April 29, 2024
- Advertisement -

లేఖ ఒక అబద్ధాల జాతర.. కేటీఆర్ కి హద్దులే లేవు..!

- Advertisement -

హైదరాబాద్‌కు ఐటీఐఆర్ తేలేని బీజేపి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్​ డిమాండ్​ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్​ను మూలకు పెట్టింది బిజెపి ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు గతంలోనే విస్పష్టమైన ప్రకటన చేశారని… సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బెంగళూరు లాంటి పట్టణంలోనూ ఐటీఐఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. బెంగళూరులో ఐటీఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా టి.అర్.ఎస్ ప్రభుత్వమే కారణమా అంటూ ప్రశ్నించారు.2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీపీఆర్​లను బండి సంజయ్​కి ఇస్తాం.. ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము ఉందా అంటూ సవాల్​ విసిరారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బిజేపి..

నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఒక ప్రకటన ఇప్పించాలన్నారు. బండి సంజయ్​కి దమ్ముంటే ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్​కి సమానమైన మరో ప్రాజెక్టును హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా… అని ప్రశ్నించారు. కేవలం మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారని కేటీఆర్​ విమర్శించారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అంటూ ఎద్దేవా చేశారు.

దుమ్మురేపుతున్న ‘సత్యమేవ జయతే’ సాంగ్!

ఆకట్టుకుంటున్న అరణ్య ట్రైలర్…!

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -