Wednesday, May 22, 2024
- Advertisement -

టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే…….. బాబు పాలన బాగాలేదన్న ప్రజలు

- Advertisement -

కొన్నేళ్ళుగా చంద్రబాబు చెప్పుకొస్తున్న ప్రజల సంతృప్తి స్థాయి కథలన్నీ బూటకమే అని తేలిపోయింది. ప్రజల సంతృప్తి స్థాయి ఎనభై శాతం పైనే అని రోజూ చెప్తూ……చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రజలను నమ్మించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఫ్రంట్ పేజ్ బేనర్ హెడ్‌లైన్స్‌తో బాబు భజన మీడియా మొత్తం ‘ప్రజలు సంతోషంగా ఉన్నారు………ఆనంద పారవశ్యంతో తాండవం చేస్తున్నారు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంతలా మభ్యపెట్టాలని చూసినప్పటికీ ప్రజలు ఆ మాయలో పడలేదని తాజాగా జాతీయ ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన గురించి ఎలా అనుకుంటున్నారు? చంద్రబాబు పాలన విషయంలో ఆయన చెప్పుకుంటున్నట్టుగానే 80 శాతం మంది సంతృప్తిగా ఉన్నారా? వాస్తవ పరిస్థితులు ఏంటి అనే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో చంద్రబాబుకు దిమ్మతిరిగే రేంజ్ ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు పాలన బాగాలేదని చెప్పి 57శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక సంక్షేమ పథకాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యాడని ఎక్కువ మంది ప్రజలు తేల్చేశారు. కేంద్రం నుంచి హామీలు రాబట్టడంలోనూ, హోదా విషయంలో నాలుక మడతెయ్యడంతో సహా అమరావతి నిర్మాణంపై కూడా ప్రజలు చంద్రబాబు పాలన పట్ల సంతృప్తిగా లేరని ఆ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వేలు తేల్చేశాయి. ఇప్పుడు చంద్రబాబు పాలన బాగాలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో ప్రజలు తేల్చిచెప్పిన నేపథ్యంలో టిడిపి శ్రేణుల్లో, నాయకుల్లో గెలుస్తాం అన్న నమ్మకాన్ని పెంచడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -