- Advertisement -

నాలుగోసారి ఫైనల్స్‌కు కేకేఆర్

- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది కేకేఆర్. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్ రైజర్స్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే చేధించి అద్భుత విజయాన్ని అందుకుంది కోల్ కతా. వెంకటేశ్‌ అయ్యర్ 28 బంతుల్లో 4 సిక్స్‌లు,5 ఫోర్లతో 51 నాటౌట్‌గా నిలవగా శ్రేయస్‌ అయ్యార్ 24 బంతుల్లో 4 సిక్స్‌లు,5 ఫోర్లతో 58 నాటౌట్‌ గా నిలిచి కోల్‌కతాను ఫైనల్స్‌కు చేర్చారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు విఫలమయ్యారు. వీరికి తోడు వరుసగా వికెట్లు కొల్పోవడంతో సన్ రైజర్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రాహుల్ త్రిపాఠి 71 పరుగులు చేయగా చివరలో కమిన్స్ 30 పరుగులు చేయడంతో హైదరాబాద్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కోల్ కతా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన మిచెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సన్‌రైజర్స్‌ రెండో క్వాలిఫయర్‌లో నేడు జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేత తో పోటీ పడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -