Wednesday, May 15, 2024
- Advertisement -

టీకా పై ట్రంప్ కీలక ప్రకటన..!

- Advertisement -

అమెరికాలో రోజుకు లక్షన్నరకుపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న వేళ కొవిడ్ నివారణ టీకాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సాధారణ ప్రజలకు టీకా ఏప్రిల్‌ నాటికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. వ్యాక్సిన్​ను మొదటగా వయోజనులకు, కరోనాకు ముందుండి పోరాడుతున్న సిబ్బందికి అందిస్తామన్నారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి రోజ్‌ గార్డెన్‌లో మాట్లాడిన ట్రంప్.. జో బైడెన్‌ ఎన్నికను అంగీకరించలేదు. జో బైడెన్‌ పరిపాలన సిఫార్సు చేసే లాక్‌డౌన్‌ను తాను ఎప్పటికీ అంగీకరించనని ట్రంప్‌ స్పష్టం చేశారు. టీకా 90శాతం ఫలితాలను ఇస్తోందనే విషయాన్ని కావాలనే తొక్కిపట్టిన ఫైజర్..​ పోలింగ్‌ రోజు తర్వాత ప్రకటించిందని ట్రంప్ ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన టీకా తయారు చేయడంలేదని ఫైజర్‌ తనకు చెప్పి తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

ఢిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం ..!

ఆ దేశం నుంచి మూడో వాక్సిన్..!

ట్రంప్ లో ఆశలు..అలస్కాలో విజయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -