Friday, May 17, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌పై మండిప‌డ్డ వంగ‌వీటి రాధా

- Advertisement -

వంగ‌వీటి రాధా ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో ఈ పేరు మార్మోగుతోంది. ఇటీవ‌లే వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేర‌డానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాధా గురువారం ఉద‌యం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వైసీపీపై పలు విమ‌ర్శలు చేశారు. నాకు పార్టీలో ఇబ్బందులు గురి చేశార‌ని చెప్పుకొచ్చారు. గ‌త కొంత‌కాలంగా నన్ను పార్టీలో చుల‌క‌న భావంతో చూశారు. నా తండ్రి రంగ విగ్ర‌హావిష్క‌ర‌ణకు కూడా అనుమ‌తి తీసుకుని వెళ్లాల‌ని హుకుం జారీ చేయ‌డం దారుణం అని రాధా తెలిపారు. పార్టీలో నన్ను ఒంట‌రి వాడిగా చిత్రిక‌రించారు. న‌న్ను తండ్రి లేనివాడిగా చూసి , నా మీద ఏదో జాలీ చూపించిన‌ట్లు న‌టించారు. నేను వైసీపీలో ఉంటే నా తండ్రి రంగ ఆశ‌యాలు నేర‌వేరవ‌ని భావించి పార్టీకి రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చారు.

జ‌గన్ త‌న నన్ను సొంత త‌మ్ముడిలా భావిస్తున్నాన‌ని చెప్పావే, క‌నీసం నాకు ఒక్క ఫోన్ అయిన చేశావా? అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు రాధా. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన త‌రువాత ఆ పార్టీ నేత‌లు న‌న్ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారని ఆయ‌న మీడియాకు తెలిపారు. ఎవ‌రైన నా క్రిందే ఉండ‌ల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నాడ‌ని , నేను అలా ఒక‌రి ద‌య మీద బ్ర‌తక‌లేన‌ని రాధా చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికైన జ‌గ‌న్ త‌న ప‌ద్ద‌తిని మార్చుకోవాలని హిత‌వు ప‌లికాడు రాధా. ఏ పార్టీలో చేరబోతున్నార‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం దాట‌వేశారు వంగ‌వీటి రాధా. చంద్ర‌బాబు పార్టీలోకి ఆహ్వానించారు, కాని చంద్ర‌బాబు గారు ఆహ్వానాన్ని మ‌న్నించాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా మీడియాపై మండిప‌డ్డాడు రాధా. ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ఆవేశంతో ఊగిపోయాడు రాధా. ఇన్నాళ్లు పార్టీలో అన్ని మూసుకుని ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. ఇంత‌కి అయిన ఏ పార్టీలో చేర‌బోతున్నారో స్ప‌ష్ట‌త మాత్రం ఇవ్వలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -