Saturday, May 18, 2024
- Advertisement -

వంగవీటి రాధాకు విజ‌య‌వాడ వాసుల ఐదు ప్ర‌శ్న‌లు

- Advertisement -

ఏపీ రాజ‌కీయాల‌లో ప‌లు కీల‌క మార్పులు చేర్పులు జ‌ర‌గుతున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌ర్వం స‌న్న‌ద్దం చేస్తున్నాయి. ఏపీ రాజ‌కీయాల‌లో వంగ‌వీటి మోహ‌న్ రంగా త‌న‌దైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ హ‌యంలో కూడా విజ‌య‌వాడ నుంచి గెలుపోంది తాను ఏంటో నిరుపించుకున్నారు. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం వంగ‌వీటి రంగాను హ‌త్య చేయించిన సంగ‌తి విజ‌య‌వాడలో చిన్న‌పిల్లాడిని అడిగిన చెబుతారు. మ‌రి తండ్రి చంపిన పార్టీలోకి ఆయ‌న కొడుకు వంగ‌వీటి రాధా చేర‌డంపై విజ‌య‌వాడ వాసుల‌తోపాటు, వంగ‌వీటి రంగా అభిమానులు కూడా అంస‌తృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఐదు ప్ర‌శ్న‌ల‌ను వంగ‌వీటి రాధాకు సంధిస్తున్నారు విజ‌య‌వాడ వాసులు.

  1. వంగ‌వీటి మోహ‌న రంగాగారును చంపిన పార్టీలో మీరు ఎలా చేర‌తారు. రంగాను చంపించింది టీడీపీ పార్టీనే అని మీరే బ‌హిరంగంగా చాలాసార్లు చెప్పారు. మ‌రి అలాంటి పార్టీలో మీరు ఎలా చేర‌తారు.
  2. గతంలో చెడ్డ‌వాడు అయిన చంద్ర‌బాబు , ఇప్పుడు ఎలా మంచివాడు అయ్యాడో మీరే చెప్పాలి. గతంలో చంద్ర‌బాబును బండ‌బూతులు తిట్టిన నోటితోనే మీరు ఎలా చంద్ర‌బాబును పొగుడుతున్నారు.
  3. వంగ‌వీటి రంగాను చంపిన వారు టీడీపీ పార్టీలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. వారితో క‌లిసి ఎలా కూర్చుంటారు.
  4. మీ నాన్న‌గారు పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేశారు. కాని మీరు మాత్రం పేద ప్ర‌జ‌ల‌కు అది చేస్తా , ఇది చేస్తాను అని మాయ మాట‌లు చెప్పి వారిని ఎంత‌గానో మోస‌గించారు.
  5. నిన్ను న‌మ్ముకున్న నీ వ‌ర్గాన్ని ఏనాడు ప‌ట్టించుకుంది లేదు. మీ రాజ‌కీయ జీవితంలో నాలుగు పార్టీలు మారిన మిమ్మ‌ల్ని మేం ఎలా న‌మ్మాలి.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు ఇవ్వ‌డం లేద‌ని , వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మీకు, టీడీపీలో అయిన ఆ సీటు ఇస్తున్నారా ..? అంటే అది కూడా లేదు. టీడీపీ పార్టీ కూడా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేసింది. టీడీపీ కూడా వైసీపీ మాదిర‌గానే మ‌చిలీప‌ట్నం నుంచి ఎంపీగానే పోటీ చేయ‌మంటున్నారు. మ‌రి అలాంట‌ప్పుడు మీరు టీడీపీలో ఎందుకు చేరారో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

మీ నాన్న వంగవీటి మోహ‌న రంగాను చంపిన పార్టీ చేరి మీ రాజ‌కీయ స‌మాధి మీరే తొవ్వుకున్నార‌ని విజ‌య‌వాడ వాసులు వంగ‌వీటి రాధాను ప్ర‌శ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -