Friday, May 17, 2024
- Advertisement -

నరసాపురం వైకాపా ఎంపి అభ్యర్థిగా ఆ టిడిపి బీసీ ఎమ్మెల్యేనా?

- Advertisement -

ప్రస్తుతం పశ్ఛిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. జనస్పందన భారీగా ఉండడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఓ వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు 2019 ఎన్నికలే లక్ష్యంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాడు జగన్. అందులో భాగంగానే తాజాగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థిని జగన్ ఫైనల్ చేశాడని తెలుస్తోంది. అంతర్గతంగా పార్టీ నాయకులకు ఆ మేరకు సందేశాలు కూడా పంపించారట.

డెల్టా ప్రాంతానికి చెందిన బీసీ వర్గం టిడిపి ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైకాపాలో చేరబోతున్నారు. బీసీలలో మంచి పట్టున్న ఆ ఎమ్మెల్యే వైకాపాలో చేరాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సదరు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో వైకాపా నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉండడంతో ఇప్పటి వరకూ జగన్ ఎస్ చెప్పలేదు. అయితే తాజాగా ఆ బీసీ ఎమ్మెల్యే నరసాపురం ఎంపి స్థానం నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపించడాట. బీసీ వర్గంలో మంచి పట్టున్న ఆ ఎమ్మెల్యే నరసాపురం ఎంపిగా గెలవడం సాధ్యమేనని వైకాపా నాయకులు కూడా జగన్‌కి చెప్పారని తెలుస్తోంది. నరసాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నింటిలో వైకాపా గెలుపును ప్రాధాన్యంగా తాను తీసుకుంటానని చెప్పిన ఆ టిడిపి బీసీ ఎమ్మెల్యే చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఆ బీసీ ఎమ్మెల్యే వైకాపాలో చేరనున్నాడని ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు వస్తుండడం ఇప్పుడు టిడిపి నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు బీసీల్లో మంచి పట్టున్న నాయకుడు, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే వైకాపాలో చేరుతుండడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -