వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంది. అభ్యర్తుల ఎంపిక దాదాపు పూర్తవడంతో ఇక ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించింది. ఈ రోజు అభ్యర్తుల జాబితాను ప్రకటించాలనుకున్నా మంచి ముహూర్తం దాటిపోవడంతో దాన్ని వాయిదా వేసింది. ఈనెల 16 న ఇడుపుల పాయలో అభ్యర్తులను జగన్ ప్రకటించనున్నారు.అక్కడ నుంచి ప్రచారం మొదలుపెట్టి, అదే రోజు గురజాలలో సభలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు.
ఆ మరుసటి రోజు మార్చి 17న నెల్లిమర, గన్నవరం ప్రాంతాల్లో రాజకీయ ప్రచార సభలకు హాజరవుతారు.వైఎస్ జగన్ తొలుత రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. 25వ తేదీ తర్వాత రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలశిల రఘరాం స్పష్టం చేశారు. వైసీపీ ప్రచారంలో వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పాల్గొంటారని తెలిపారు. వీరిద్దరూ రోజుకు 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందించాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే హెలికాప్టర్ లో 45 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 22న పులివెందులలో వైసీపీ అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు