Thursday, May 8, 2025
- Advertisement -

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు డోర్ డెలివ‌రీ….వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

గ్రామ సచివాలయం ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని చెప్పారు వైఎస్ జ‌గ‌న్‌. ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.దానికోసం ప్ర‌తి 50 కుటంబాల‌కు రూ.5000 జీతం ఇస్తూ ఒక‌రిని నియ‌మిస్తామ‌న్నారు. అర్హులైన వారు ఏప‌థాకినికైనా ద‌ర‌ఖాస్తు చేసుకున్న 72 గంట‌ల్లో మంజూరు చేస్తామ‌ని తెలిపారు.

ప్రజా సంకల్పయాత్ర అనంతరం వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సమర శంఖారావం, అన్నపిలుపు వంటి కార్యక్రమాలకు కార్యచరణ రూపొందించారు. త‌ట‌స్థ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకొనేందుకు అన్న పిలుపుతో కార్య‌క్ర‌మం ద్వారా ముందు కెల్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో 70 వేల మందికి లేఖ‌లు కూడా రాశారు జ‌గ‌న్‌. త‌ర్వాత ఉద్యోగుల‌కు కూడా లేఖ‌లు రాసిన జ‌గ‌న్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని లేఖ‌లో కోరారు.

అలా లేఖలు అందిన వారిలో 175 మందితో వైఎస్ జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. న్యూట్రల్ గా ఉన్న విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, వైద్యులు, మేధావులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాను రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యతక గురించి వారితో చర్చించారు. తాను భవిష్యత్ లో చేపట్టబోయే అంశాలపై కూడా వారితో చర్చించారు. ఇంకా వివిధ అంశాల‌పై చ‌ర్చించారు.

ఈసారి కేంద్రంలో హంగ్ వ‌చ్చే వవ‌కాశ‌ముంద‌న్నారు. 25 మంది ఎంపీలు గెలుచుకుంటే కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌చ్చ‌న్నారు.చట్టం ప్రకారం విశాఖపట్నంకు రైల్వే జోన్ రావాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్ ఉందని, మరి నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం పోరాటం చేద్దామన్నారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని మ‌రో సారి తేల్చి చెప్పారు. పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే మ‌రో సారి మోస‌పోతామ‌న్నారు. ప్ర‌త్యేక హోదాపై ఎవ‌రు సంత‌కం పెడ‌తారో వారికే కేంద్రంలో వారికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తెలిపారు. బాబు వైసీపీ ప‌థ‌కాలు ఎంత కాపీ కొట్టినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు.మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు. పవర్ లూమ్‌లు ఉన్న వారికి కరెంట్ ఛార్జీలు ఇస్తామని అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేటట్లు చూస్తామని చెప్పారు. వైయస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు ఉచితంగా ఇస్తామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -