Thursday, April 25, 2024
- Advertisement -

రాజు గారిని దించడం కోసం జగన్ అలా నరుక్కోస్తున్నాడా..?

- Advertisement -

కొన్ని రోజుల ముందు అసంతృప్తి పేరు తో వైసీపీ పార్టీ చిన్న పాటి యుద్ధం చేసిన నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది..  వైసీపీ పార్టీ లో గెలిచిన అందరు నేతలు ఇప్పటివరకు జగన్ యందు ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకుని ఆయనతో ఎప్పటికి మంచి రిలేషన్ షిప్ పెంచుకోవాలని పని చేస్తున్నవారే.. ఆయనకు ప్రజల్లో పెరిగిపోతున్న అభిమానాన్ని బట్టి చూస్తే మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి వైసీపీ అధికారంలో ఉంటే తమకు మంత్రి పదవి తప్పక వస్తుంది అని అందరు ఎంతో నిజాయితీగా జగన్ తో ఉంటున్నారు.. అయితే నర్సాపురం రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు విషయంలో మాత్రం వైసీపీ ఎప్పుడు ఊహించనిది జరుగుతుంది..

తొలుత పార్టీ లోని కొంతమంది ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన రాజు గారు ఆ తరవాత డైరెక్ట్ సీఎం జగన్ ను టార్గెట్ చేయడంతో వైసీపీ పార్టీ కొంత ఆవేశంగా వుంది.. ఇక ఢిల్లీ లో కూడా ఆయనపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..  కానీ ఢిల్లీ లోని కేంద్రం ఈ విషయాన్నీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉంది.. అవసరం వచ్చినప్పుడు ఈ విషయాన్నీ ఆలోచిద్దామని బీజేపీ అనుకోగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రఘు రామ కృష్ణం రాజు టీడీపీ మాదిరి వైసీపీ విమర్శించడం మొదలుపెట్టారు..

తాజాగా రఘు రామ కృష్ణం రాజు  మరో సారి జగన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలని బట్టి రఘురామ కృష్ణంరాజుకు ఇన్నాళ్లు సైలెంట్ గాఉంది మళ్ళీ కోప్పడడానికి ఓ కారణం ఉందని చెప్తున్నారు. ఇటీవల జగన్ అమిత్ షా ను కలసినప్పుడు రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటీషన్ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తనను వదలిపెట్టకుండా వెంటపడుతుండటంపై రాజుగారు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా తాను చేరాలనుకుంటున్న బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం కూడా రఘురామ కృష్ణంరాజు కు రుచించడం లేదు. దాంతో రఘు రామ కృష్ణం రాజు కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.. మరి తన పదవి కాపాడుకోవడానికి రఘు రామ కృష్ణం రాజు ఏ ప్రయత్నాలు చేస్తారో చూడాలి..

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -