Thursday, March 28, 2024
- Advertisement -

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

- Advertisement -

చంద్రబాబు రాజకీయం ను ప్రత్యక్షంగా చూసిన వారెవరైనా ఆయనలో యూస్ అండ్ త్రో భావాలూ ఎక్కువగా కనిపిస్తాయని అంటారు.. ఎందుకంటే గతంలో అయన చాలామంది రాజకీయ నాయకులను ఇలా వాడుకుని వదిలేశారు. దాంతో ఆ నాయకులూ ఇప్పటికి చంద్రబాబు అంటే మండిపడుతున్నారు.. నిజానికి ఒక రాజకీయ నాయకుడు ఇలా చేసి పైకి వస్తే చివరకి అయన పరిష్టితి ఇలానే అవుతుంది.. చంద్రబాబు వాడుకున్న వారిలో చాలామంది నాయకులూ ఉండగా బాబు చివరకి బొబ్బిలి రాజులను కూడా వదల్లేదు అనే భావన  వారిలో ఇప్పటికీ కోపాన్ని రగిలిస్తుంది..

బొబ్బిలి రాజులుగా ఒకనాడు జిల్లాలో చక్రం తిప్పిన సుజయ సోదరులను పసుపు పార్టీ ఏమీ కానట్లుగా ఎడంగా నెట్టేసిందని అంటున్నారు. ఈ పరిణామంతో బొబ్బిలి రాజ వంశీకులలో హాట్ హాట్ చర్చ సాగుతోందిట. ఇక ఎన్నికల్లో ఓడిన తరువాత సుజయ కృష్ణ రంగారావు కొన్నాళ్ళ పాటు హడావుడి చేసినా కూడా ఆ తరువాత నుంచి మౌనమే నా మాట అంటున్నారు. ఇక ఆయన మకాం కూడా విశాఖలోనే ఉంది. ఆయన ఎపుడో కానీ బొబ్బిలి రారు అన్న ప్రచారం కూడా ఉంది. దీంతో ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నట్లుగా బాబు ఒక దారి చూపించేశారని అంటున్నారు.

ఇక చలా పరిణామాలు తరవాత సుజయ ఇప్పుడు తన మాతృ సంస్థ వైసీపీ లోకి వస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. జగన్ కి కూడా ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక అయన టీడీపీ కి మారినా కూడా జగన్ ని పెద్దగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయలేదు. ఆయనకు జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోనే విభేదాలు తారస్థాయిలో ఉండేవి. ఇపుడు కూడా జిల్లా రాజకీయాల్లో బొత్సదే హవాగా ఉన్నా జగన్ ఏం చెబితే చేయడానికి ఎవరైనా రెడీగా ఉండాల్సిందే. అందువల్ల సుజయ కృష్ణ రంగారావు ని వైసీపీలోకి తీసుకోవాలని జగన్ కనుక అనుకుంటే నో చెప్పేవారు ఎవరూ ఉండరని అంటున్నారు. మరోవైపు ఆయన కోసం బీజేపీ కూడా తలుపులు బార్లా తెరచేసింది. బొబ్బిలి రాజులు ఏ వైపునకు మొగ్గు చూపుతారో మరి చూడాలి.

సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!

బాబుకు పెద్ద షాక్.. వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -