Friday, May 17, 2024
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధుల కోసం వైసిపి దృష్టి….

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్తులు క‌రువ‌య్యారు. పోయిన ఎన్నికల్లో వైసిపి 67 నియోజకవర్గాల్లో గెలిచింది. అదే విధంగా 8 పార్లమెంటు స్ధానాలను కూడా గెలుచుకుంది. వాల్లలో కొంద‌రు టీడీపీలోకి ఫిరాయించారు.

పోయిన సారి పార్టీ నాయకత్వం చేసిన తప్పుల వల్ల చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి తేడాతో టిడిపి అభ్యర్ధులు గెలిచారు. సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు టికెట్టు ఇవ్వ‌డంతోపాటు… చిరినిమిషంలో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పార్టీ దెబ్బ‌తింది.

అయితే ఇలాంటిసారి అలాంటి త‌ప్పుజ‌ర‌గ‌కుండా జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ముందుగా ఫిరాయింపు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే చేయించారు. జగన్ ముందుగానే నియోజకవర్గాల్లో వివిధ అంశాలపై సర్వేలు చేయించుకుని అభ్యర్ధిత్వాలపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే ముందు ఫిరాయింపు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారని సమాచారం.

రంపచోడవరం, పాడేరు, అరకులోయ, ప్రత్తిపాడు, అద్దంకి, పలమనేరు, కోడుమూరు, జమ్మలమడుగు, నంద్యాల, ఆళ్ళగడ్డ, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో గట్టి ప్రత్యామ్నాయాల కోసం సర్వే జరుగుతోంది. అలాగే, కొవ్వూరు, ఆచంట, గుంటూరు-2, కందుకూరు, అనంతపురం టౌన్, కర్నూలు నుండి బరిలోకి దింపటానికి గట్టి అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు పేర్లపై నియోజకవర్గంలో అభిప్రాయసేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇవికాకుండా విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, ఏలూరులో ఆళ్ళనాని, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించేసారు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యామ్నాయాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. టికెట్టు ఎవ‌రికి ద‌క్కుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -