Thursday, May 16, 2024
- Advertisement -

నంద్యాల ఓట‌ర్ల దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చినా మార‌ని జ‌గ‌న్‌….

- Advertisement -

ఉప ఎన్నికలో వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టారు నంద్యాల‌ ప్ర‌జ‌లు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ తీర్పు నిచ్చారు. టీడీపీ అభ్య‌ర్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డ‌ని అత్య‌ధిక మెజారిటీతో గెలిపించారు. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లే వైసీపీ అప‌జ‌యానికి కార‌ణమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక ప్ర‌తిప‌క్ష‌హోదాలో ఉన్న నాయ‌కుడు త‌న స్థాయికి త‌గిని విధంగా మాట్ల‌డ‌లేదనె విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జ‌గ‌న్ త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. సీఎం చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై ఉరేయాలి, కాల్చేయాలి , కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీయాలి` అంటూ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజకీయ పండితుల‌ను విస్మ‌యానికి గురిచేశాయి. జ‌గ‌న్ వ్వ‌వ‌హార‌శైలిలో మార్పు రావాల‌ని సూచిస్తున్నా ..జ‌గ‌న్‌లో మాత్రం క‌నిపించ‌డంలేదు.

ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత జ‌గ‌న్ పెట్టిన ప్రెస్ మీట్‌లో మ‌రో సారి త‌న స్థాయికి త‌గ్గి.., దిగ‌జారి మాట్లాడార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని జగన్ అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మాకు టైం వచ్చినప్పుడు మేమూ దెబ్బ కొడతామని వైయస్ జగన్ అన్నారు. న‌యానో భ‌యానో గెలుపు గెలుపే అన్న ప్ర‌జా తీర్పును ఎవ‌రైనా హుందాగా స్వీక‌రించాలి.

ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తాం… లోపాలు ఉంటె స‌రిచేసుకుంటామ‌ని జ‌గ‌న్.. హుందాగా మాట్లాడింటె బాగుండేద‌నె వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈవిదంగా పార్టీ నాయ‌కుల‌తోనైనా మాట్లాడించి ఉండాల్సింది. కాని జ‌గ‌న్ మ‌రో సారి త‌న స్థాయికి త‌గ్గ మాట‌లు మాట్లాడ‌లేద‌నెది స్ప‌ష్టమ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -