Sunday, June 16, 2024
- Advertisement -

పాద‌యాత్ర డేట్ ఫిక్స్ చేసిన పండితులు….

- Advertisement -

అంద‌రు అనుకున్న‌ట్లుగానె జ‌గ‌న్ పాద‌యాత్ర వాయిదా పండింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పార్టీ ప్లీన‌రీలో అక్టోబ‌ర్ 27 నుంచి అన్న‌వ‌స్తున్నాడు కార్య‌క్ర‌మంతో పాద‌యాత్ర చేప‌డుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితె పాద‌యాత్ర‌కు కోర్టు అనుమ‌తి ఇస్తుందా లేదా అనేది అస‌క్తిక‌రంగా మారింది. మ‌రో వైపు పాద‌యాత్ర‌కు ముహూర్తం స‌రిగా లేద‌ని పండితులు చెప్పార‌ని పార్టీ నాయ‌కు అంటున్నారు. అంద‌రు అనుకున్న‌ట్లుగానె పాద‌యాత్ర డేట్ మారింది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మేరకు ప్రచారం చేసింది. అయితే.. ఇప్పుడు ముహూర్త బలానికి విలువ ఇస్తున్నారట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. కొత్త ముహూర్తం ఏది అనగా.. నవంబర్ రెండు అని తేల్చారట. నవంబర్ రెండో తేదీన ముహూర్తం బ్రహ్మాండంగా ఉందని అందుకే ఈ మార్పు జరిగిందని సమాచారం.

పండితులను సంప్రదించి పాదయాత్రకుముహూర్తాన్ని నిర్ణయించారట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కొత్త ముహూర్తానికి బలం బాగుందని.. ఇక దూసుకుపోవడమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నడుస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పాదయాత్ర సెంటిమెంట్ ఇది వరకూ వైఎస్ కు కలిసి వచ్చింది, ఇప్పుడు జగన్ కు కూడా కలిసి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.

ప్రత్యేకించి.. పాద‌యాత్ర‌కు వివిధ ఆటంకాలు ఉన్నాయి. కోర్టు అనుమతి విషయంలో ఇంకా క్లారిటీ లేరు. ఇది వరకూ ఒకసారి పర్మిషన్ విషయంలో కోర్టును సంప్రదించారు. ప్రతి శుక్రవారానా కోర్టుకు హాజరు కాకుండా మినహాయించడానికి కోర్టు ఒప్పుకోలేదు. సీబీఐ కోర్టులో డిస్‌ఛార్జ్ పిటీష‌న్ వేశారు. మ‌రి సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -