జనసేన గూటికి రఘురామ ?

YSRCP Rebel MP Raghu Rama Krishnam Raju Likely Join Janasena Party

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన గూటికి చేరబోతున్నారా ? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీగా ఆ పార్టీ నేతలపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఎప్పుడు విమర్శనస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు రఘురామ. అలాగే రఘురామ విమర్శలను ఎదుర్కొనేందుకు ఎంపీ విజయ సాయి రెడ్డి ముందు వరుసలో ఉంటాడు. ఇక అమద్య రఘురామ ను జైల్ కు పంపించడం, జైల్ నుంచి వచ్చిన రఘురామ వైఎస్ జగన్ పై అక్రమాస్తుల విషయంలో కోర్టులో పిటిషన్ వేయడం.. ఇలా వైఎస్ జగన్ – రఘురామ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం కొనసాగుతూ వస్తోంది. .

ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం ఎంపీ గా గెలిచిన రఘురామ.. వివాదాల కారణంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటున్నారని.. త్వరలోనే టిడిపి తీర్థం పుచ్చుకొనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిపై అటు రఘురామ గాని, టీడీపీ శ్రేణులు గాని స్పష్టం చేయలేదు.ఇక ప్రస్తుతం డిల్లీలో ఉంటున్న రఘురామ బీజేపీ అధిష్టానంతో తరచూ చర్చలు జరుపుతున్నారని, బీజేపీ అండతోనే రఘురామ వైసీపీ ని టార్గెట్ చేశాడనే వాదనలు కూడా వచ్చాయి. దీంతో రఘురామ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనని భావించరంతా.

కానీ ఇప్పటివరకు దానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఇక ప్రస్తుతం ఆయన జనసేన వైపు చూస్తున్నారు అనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మద్య రఘురామ తన మాటల్లో తరచూ పవన్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కూడా ఇటీవల భీమవరం జనవాణి కార్యక్రమంలో భాగంగా రఘురామ ప్రస్తావనను తీసుకువచ్చారు. రఘురామ ను వైసీపీ వేదిస్తోందని, తన సొంత నియోజిక వర్గానికి రాకుండా రఘురామను వైసీపీ అడ్డుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్.. రఘురామ చేరికపై పరోక్షంగా హింట్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రఘురామ కూడా జనసేన గూటికి చేరేందుకు ఆసక్తిగానే ఉన్నారట. మరి ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు.. వచ్చే ఎన్నికలకు గాను ఏ పార్టీ గూటికి చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.

More Like This

డోర్ డెలివరీ.. ఏంటిది జగన్ సారూ !

మోడి కుల రాజకీయాలు చేస్తున్నారా ?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరు.. ఎందుకో తెలుసా ?