Friday, March 29, 2024
- Advertisement -

కుల సమీకరణలు చేస్తోన్న మోడి !

- Advertisement -

ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ హవా గట్టిగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడి-అమిత్ షా ద్వయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ అన్నీ రాష్ట్రాలలో కూడా సత్తా చాటుతోంది. అయితే బీజేపీ ఈ స్థాయిలో విస్తరిచడానికి మోడి-షా ద్వయం అనుసరిస్తున్న కుల సమీకరణలే కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడి ఓబీసీ కి చెందిన వ్యక్తి, ఇక రాష్ట్రపతి పదవి కోసం బిజెపి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి ఆదివాసీకి చెందిన మహిళా, ఇక తాజాగా ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎంపిక చేసిన వ్యక్తి ఓబీసీ కి చెందిన వ్యక్తి. ఆ విధంగా చూస్తే బీజేపీ కుల సమీకరణలను ఎంత పక్కాగా అనుసరిస్తోందో స్పష్టంగా అర్థమౌతుంది..

గత ఏడాది జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ తరువాత ప్రస్తుతం మంత్రి వర్గంలో 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 11 మంది మహిళా మంత్రులు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వెనుకబడిన కులాల వారికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు వాజ్ పేయి-అద్వానీ హయాంలో బీజేపీకి అగ్రవర్ణ కులాల పార్టీగా పేరుండేది. దాంతో బ్రాహ్మణ బనియ వంటి వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ రావడం వల్ల బీజేపీ కి 24-28 శాతం మాత్రమే ఓట్లు దక్కేవి. అయితే మోడి-అమిత్ షా హయం వచ్చే సరికి ఉన్నత కులాల పార్టీ అనే ముసుగును తీసివేసి, ఎక్కువగా వెనుకబడిన వర్గాల వారు అనగా ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ వంటి వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

దాంతో బీజేపీ ఓటు శాతం గతంతో పోలిస్తే చాలా పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీజేపీ కుల సమీకరణల పట్ల శ్రద్ద చూపడానికి.. రాబోయే ఎన్నికలే ..కారణం అని కొందరి భావనా.. ఎందుకంటే రాబోయే రోజుల్లో గుజరాత్ తో పాటు ఆదివాసీలు ఎక్కువగా ఉన్న పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళా ద్రౌపది ముర్ము ను ప్రకటించారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీ వర్గానికి చెందిన జగ్ దీప్ ధన్ ఖడ్ ను ఎంచుకోవడానికి కూడా వచ్చే ఏడాదిలో జరగనున్న రాజస్తాన్, హరియాణ అసెంబ్లీ ఎన్నికలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద మోడి- అమిత్ షా ద్వయం చేస్తున్న ఈ కుల సమీకరణలు బీజేపీ ని గట్టిగానే బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

More Like This

డోర్ డెలివరీ.. ఏంటిది జగన్ సారూ !

పవన్ ” ఆకర్ష్ ” .. మొదలు ?

చైనాకు తలొగ్గిన మోడీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -