జగన్ సారూ.. రోడ్లు మామూలుగా లేవుగా !

ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసేందుకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు జనసేన పార్టీ. ఈ మద్య కాలంలో బాగా యాక్టివ్ అయిన జనసేనాని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దూసుకుపోతున్నారు. పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడంతో జనసైనికులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక జగన్ సర్కార్ లో రోడ్ల పరిస్థితిపై గుడ్ మార్నింగ్ సిఎం సార్ అంటూ డిజిటల్ క్యాంపైన్ రన్ చేస్తోంది జనసేన పార్టీ. రాష్ట్రంలో చెడిపోయిన రోడ్లను, అలాగే మరమ్మత్తుకు నోచుకోని రోడ్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తున్నారు జనసైనికులు. దాంతో ఏపీ లో ఉన్న దరిద్రమైన రోడ్ల యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. .

దాంతో వైరల్ అవుతున్న రోడ్ల ఫోటోలపై మీమ్స్ క్రియేట్ చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు నెటిజన్స్. ఇక పవన్ తన ట్విట్టర్ ఖాతాలో రోడ్లపై సెటైర్స్ వేస్తూ పోస్ట్ చేస్తున్న కార్టూన్ ఫోటోస్ మరింత వైరల్ అవుతున్నాయి. దాంతో జనసేన చేపట్టిన ఈ గుడ్ మార్నింగ్ సిఎం సార్ డిజిటల్ క్యాంపైన్ సక్సస్ అవుతుండడంతో దీనికి చెక్ పెట్టేందుకు వైసీపీ కూడా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు అనే హ్యాస్ ట్యాగ్ తో బాగున్న రోడ్ల ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జనసేన కు కౌంటర్ ఇస్తోంది. ఇక ఏపీ లోని రోడ్ల విషయంలో జనసేన- వైసీపీ మద్య డిజిటల్ వార్ కొనసాగుతూనే ఉంది.

అయితే ఏపీలో నానాటికీ అద్వానంగా తయారవుతున్న రోడ్లను మరమత్తు చేసేందుకు సి‌ఎం జగన్ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికి ఫలితం మాత్రం కనిపించడం లేదు. అసలే వర్షాకాలం కావడంతో అద్వానంగా ఉన్న రోడ్లపై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో రోడ్ల విషయంలో ప్రభుత్వంపై ఏర్పడుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ డిజిటల్ క్యాంపైన్ ను మరింతగా ప్రజల్లోకి జనసైనికులు గట్టి ప్రయత్నలే చేస్తున్నారు.

More Like This

విస్తరిస్తోన్న ఆప్.. సౌత్ లో పాగా వేసేనా ?

జగన్ వదిలేస్తే.. మేము పూర్తి చేస్తాం !

ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన బాబు..!

Related Articles

Most Populer

Recent Posts