Friday, May 9, 2025
- Advertisement -

ఉపాసన గురించి ఎవరికి తెలియని విషయాలు!

- Advertisement -
10 interesting facts upasana kamineni

టాలీవుడ్ లో రాం చరణ్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు.

చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొణిదెల కోడలు గురించి ఆసక్తి కరమైన విషయాలు..

* ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని.

* ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండోది.

* ఉపాసన కామినేని చిన్న వయసునుంచే వ్యాపార సామ్రాజ్య సంగతులను నేర్చుకున్నారు.

* పదిహేనేళ్ళకే “యు ఎక్సేంజ్” సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించే వారు. అంతేకాదు మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించే వారు.

* ఆమె లండన్ రీజెన్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.

* రామ్ చరణ్ ఉపసానలకి 14 June 2012 న పెళ్లి జరిగింది.

* పాతికేళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్ లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు.

* ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.

* పేపర్లను, పుస్తకాలను చదవడమే కాదు “బి పాజిటివ్” అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్నారు.

* ఇన్ని పనులను విజయవంతంగా నిర్వహిస్తూనే కొణిదెల ఇంట కోడలుగా కుటుంబ సభ్యులందరీ మనసులను గెలుచుకున్నారు.

Related

  1. పవన్ ఖర్చు విషయాలు తెలిస్తే.. షాక్ కావాల్సిందే!
  2. తరుణ్ తో పెళ్లి విషయని బయట పెట్టిన ప్రియమణి
  3. ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ
  4. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -