రిలయన్స్ జియో ఉచిత వెల్ కం ఆఫర్ పోటీని తట్టకునేందుకు మిగిలిన టెలికం కంపెనీలు కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు పైఎత్తులు వేస్తున్నాయి. జియో దెబ్బకు ఎయిర్‌టెల్ – ఐడియా – వోడాఫోన్ మార్కెట్లో ఎన్ని కొత్త ఆఫర్లతో వస్తున్నా జియో తన ఉచిత ఆఫర్‌ను మరింత కాలం పొడిగిస్తుండడంతో మిగిలిన టెలికం కంపెనీలు తమ యూజర్లను కాపాడుకోవడానికి బాగా నానా తిప్పలు పడుతున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలోనే 28 కోట్ల యూజర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న ఎయిర్‌టెల్ తన యూజర్లు జియో వైపునకు మళ్లకుండా ఉండేందుకు రెండు సూపర్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ అంటూ రూ. 549, రూ. 799 రీచార్జ్ తో అపరిమిత కాల్స్, డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది.
రూ. 549 ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, 4జీ స్మార్ట్ ఫోన్ లేకుంటే 1 జీబీ 3జీ డేటా, 4జీ ఉంటే 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు వింక్ మ్యూజిక్, మూవీ సేవలు అందుతాయి. రూ. 799 ప్లాన్ లో రూ. 549 సౌకర్యాలతో పాటు 4జీ ఫోన్ లేకుంటే 2 జీబీ 3జీ డేటా, 4 జీ ఫోన్ ఉంటే 4 జీబీ డేటా లభిస్తుంది.
Related