Sunday, May 26, 2024
- Advertisement -

ఎయిర్ టెల్ బ్యాంకింగ్ ఆఫర్స్!

- Advertisement -
airtel banks super offers

ఎయిర్ టెల్ ఇండియ‌న్ టెలికం రంగంలో 28 కోట్ల వినియోగ‌దారుల‌తో త‌న‌దైన స్టైల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక పై బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ ఎయిర్ టెల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. రీసెంట్ గా ఎయిర్‌టెల్ సంస్థ ‘ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్’ పేరుతో కొత్త బ్యాంకింగ్ సేవలను మొదలు పెట్టింది. రాజ‌స్థాన్‌లో మొదటిగా ఈ ఎయిర్‌టెల్ బ్యాంకింగ్ సేవ‌లు స్టార్ట్ అయ్యాయి. రాజ‌స్థాన్‌లో ఉన్న 10వేల ఎయిర్ టెల్ రిటెయిల్ ఔట్ లెట్లలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

వీటి ద్వారా అక్కడి ప్రజలు నగదు డిపాజిట్ – విత్ డ్రా – ట్రాన్స్ ఫర్ – ఆన్ లైన్ షాపింగ్ – బిల్ పేమెంట్స్ వంటి పనులు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎయిర్‌టెల్ ముందుగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఎయిర్ టెల్ ఫోన్ నంబర్లు ఉన్న వారు ఆ నంబర్లనే తమ అకౌంట్ నంబర్లుగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లలో వాడుకోవచ్చు. ఇక మిగిలిన టెలికం కంపెనీల‌కు చెందిన వారు ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పిస్తే వారు కూడా ఎయిర్ టెల్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఇక ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ లలో వినియోగదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే అందుకు వీరికి 7.25 శాతం చొప్పున వడ్డీ కూడా లభిస్తుంది. నగదును నచ్చినప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. దేశంలోని ఏ బ్యాంక్ ఖాతాకైనా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. మ‌రో ఆఫ‌ర్ ఏంటంటే ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ల‌లో ఖాతాలు ఓపెన్ చేసే వారికి ల‌క్ష రూపాయ‌ల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభ్యమవుతోంది. దేశ‌మంత‌టా ఈ సేవలను త్వరలో విస్త‌రించ‌నున్నారు.

Related

  1. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!
  2. ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
  3. జియోకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన ఆర్‌కామ్‌
  4. రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -