Friday, May 17, 2024
- Advertisement -

స్టూడెంట్స్ ఆత్మహత్యలు, అత్యాచారాలు, అవినీతి, దళితులపై దాడులు… 2017లో ఎపి చరిత్ర

- Advertisement -

అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనొస్తే అంతా బాగుంటుందని ప్రచారం దున్నేశారు. ఆయన వచ్చారు. దళితులపై దాడుల విషయంలో ఎపిదే నంబర్ ఒన్ స్థానం. ఉత్తరభారతదేశంలో యూపీ వరస్ట్ స్టేట్‌గా నిలిస్తే దక్షిణ భారతదేశంలో ఎపినే వరస్ట్ స్టేట్‌గా నిలిచింది.

ఇక విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మహత్యలు అయితే అత్యంత బాధాకరం. ప్రతిభావంతులైన భావి భారత కుసుమాలన్నీ కూడా అధికారం కూడా దక్కించుకుని మంత్రిగా వెలగబెడుతున్న అధికార పార్టీ నేత కాలేజీల్లో రాలిపోతూ ఉన్నాయి. కేసులు ఉండవు. న్యాయం జరిగే ప్రసక్తేలేదు. 2014 తర్వాత నుంచీ ఆంద్రప్రదేశ్ అత్యంత ఎక్కువగా అభివృద్ధి సాధించింది ఈ విషయంలోనేనేమో. ఇక 2017 అయితే చరిత్రలో నిలిచిపోతుంది. అంతమంది విద్యార్థినీ విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు మరి.

అవినీతిలో కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో కెల్లా నంబర్ ఒన్‌గా నిలిచింది. చెడ్డపేరు పోగొట్టుకోవడానికి మాత్రం ఎసిబి దాడులు అంటే షో చేశారు కానీ ఒక్కరికి కూడా శిక్ష పడింది లేదు. ఒక్క అవినీతి అధికారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంది లేదు అని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అలాగే వరస్ట్ ముఖ్యమంత్రుల రేసులో చంద్రబాబునాయుడు అగ్రస్థానంలో దూసుకెళ్ళడం కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. ఇక మహిళలపై అత్యాచారాలు, దాడుల విషయంలో ఆంద్రప్రదేశ్‌ది అగ్రస్థానమే. అదేంటో మరి…….ఆయన వచ్చాక మహిళలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది.

టిడిపి నేతలు, కార్యకర్తల దాడులు, ఆగడాలు కూడా ఈ సంవత్సరంలో మరీ శృతిమించిపోయాయి. చంద్రబాబు నాయుడే స్వయంగా టిడిపి కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్న ప్రస్తావిస్తూ కంట్రోల్‌లో ఉండాలని హితబోధ చేయాల్సిన పరిస్థితి.

ఇక కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్‌కి ఈ సంవత్సరం కూడా కేంద్రం నుంచి నామ మాత్రపు నిధులు కూడా రాలేదు. రాజధాని నిర్మాణం ఇంకా గ్రాఫిక్స్ బొమ్మల స్థాయిలోనే ఉంది. మూడున్నరేళ్ళుగా బొమ్మలతోనే కాలం గడుపుతున్న చంద్రబాబు………కనీసం 2018లో అన్నా పునాదుల తవ్వకం అయినా మొదలుపెడతాడేమో చూడాలి. 2018లో అయినా ప్రచారంతో మేజిక్కులు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం మానేసి, అప్పులపైన ఆధారపడడం తగ్గించి నిర్మాణాత్మక అభివృద్ధివైపు ఆంద్రప్రదేశ్‌ని నడిపించే ప్రయత్నం చంద్రబాబునాయుడు చేయాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -