వీ-6 ఛానెళ్లో వస్తున్న ఓ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు బిత్తిరి సత్తి. అయితే అంతకు ముందు రవి కొన్ని ఛానెళ్లలో చేసిన ప్రోగ్రామ్స్ అతడికి పేరు తేలేదు. అయితే వీ-6లో వచ్చిన తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా అతడి దశ మారిపోయింది. ఆ తీన్మార్ ప్రోగ్రామ్‌లో అతడు వేసే సెటైర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లోడాన్ లాగు, రంగుపూల చొక్కా, అంట కత్తెర జుట్టు, ఎడ్డి మాటలు, అమాయకపు చూపులతో తీన్మార్‌లో బిత్తిరి సత్తి సూపర్ పాపులర్ అయ్యాడు.
బిత్తిరి సత్తి క్యారెక్టర్‌కు పిల్లలు, యుక్త వయస్కులు, ముసలోల్లలో కూడా బిత్తిరి సత్తి సూపర్ పాపులర్ అయ్యాడు. ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నా రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమం అతడికి ఉన్న ఫాలోయింగ్‌ను తేటతెల్లం చేసింది.
జీ తెలుగు ఛానెల్ వరంగల్‌లో బోనాల సందర్భంగా ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి వేదికమీదకు రాగానే అతడికి వచ్చిన రెస్పాన్స్ చూసి స్టార్ నటులు, యాక్టర్లు, స్టార్ యాంకర్లు, సెలబ్రిటీలు షాక్ అయిపోయారు. సత్తి మాట్లాడే ప్రతి మాటలకు ఈలలు, కేకలు, అరుపులతో ఆ వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. సత్తి ఈ ప్రోగ్రామ్‌లో కొన్ని టాప్ పాటలను తీసుకుని… ఆ హీరోలను బిత్తిరి సత్తి అనుకరిస్తే ఎలా ఉంటుందో చేశాడు. అయితే అవే పాటలు ఇతర కమెడియన్లు అనుకరిస్తే అంతా బాగా పేలేవి కావేమో…అయితే బిత్తిరి సత్తి చేసిన ఈ ఎపిసోడ్ ఉన్నంత సేపు విజిల్స్, అరుపులు, కేకలు ఆగలేదు. దటీజ్ బిత్తిరి సత్తి అనాల్సిందే.
{youtube}v=KTPQZC9Ebuk{/youtube}
Related