Thursday, May 16, 2024
- Advertisement -

చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!

- Advertisement -

చిరు 150వ సినిమాపై సినీ పరిశ్రమలోనే కాకుండా అభిమానులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో కనిసం ఒక్క సీన్ లో అయిన కనిపించాలని మెగా ఫ్యామిలీ హీరోలు చూస్తున్నారు. అయితే డాడీ, డైరెక్టర్ వినాయక్ ఒప్పుకుంటే ఒక పాటలో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు చరణ్. అయితే ఈ 150వ సినిమాలో వచ్చే ఇంటర్డక్షన్ సాంగ్ లో మెగా హీరోలు కనిపించాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే చిరంజీవి కూడా ఓకే చెప్పాడట. మగధీరలో చిరు స్టెప్పేశాడు, ఇప్పుడు చరణ్ కత్తిలాంటోడులో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాడట. ఇప్పటికే వారి కోరికను చిరు చెవిలే వేయగా చూద్దాంలే. ఛాన్స్ ఉంటే చేసేద్దాం అని చెప్పారట. మరి చరణ్ ఒక్కడే కనిపిస్తాడా లేక మెగా ఫ్యామిలీ హీరోలు అందరు కనిపిస్తారనేది చూడాలి.

అయితే చిరు పక్కన డ్యాన్సర్స్ తో కలిపి మెగా ఫ్యామిలీ చిందేయనుందని, ప్రత్యేకంగా కాకుండా పక్కన చూపించాలని చిరు అనుకుంటున్నాడట. ఎందుకంటే పాట సీరియెస్ నెస్ కూడా ఆడియెన్స్ ఫీలవ్వాలని మెగాస్టార్ అంటున్నారట. మరి ఏం జరగనుందో త్వరలోనే క్లారిటీ రానుంది.

Related

  1. చిరు సినిమాలో విజయశాంతి
  2. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  3. బాహుబలి లో మెగా హీరో..!
  4. డాన్స్ విషయంలో ఆ హీరో బెస్ట్ అంటున్న మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -