Friday, May 17, 2024
- Advertisement -

ఐటీ దాడులు జ‌స్ట్ శాంపిల్‌మాత్ర‌మేనా….? మేయిన్ పిక్చ‌ర్ ముందుందా..?

- Advertisement -

రాజాకీయాల్లో త‌మ‌కు అడ్డు వ‌చ్చేవాల్ల‌ని, వ్య‌తిరేకంగా కుట్ర‌లు పన్నేవారిని తొక్క‌యేడం చాలా సంద‌ర్భాల్లో చూశాం. త‌మ‌కంటే పై అధికారంలో ఉన్న వాల్ల‌తో పెట్టుకుంటే ప‌రిస్థితులు తారుమారు అవుతాయి. మోదీకీ ఎవ‌రు ఎదురు తిరిగినా పాతాళానికి తొక్కేయ‌డంలో మోడీ త‌రువాతే ఎవ‌ర‌యినా. అద్వానీ లాంటి సీనియ‌ర్ నేత‌ల‌నే అడ్ర‌స్ లేకుండా చేవారు మోడీ. ఇదెంత ఎందుకు అనుకుంటున్నారా…! వ‌స్తున్నా అక్క‌డికే…!

భాజాపాతో విడాకులు తీసుకున్న త‌రువాత చంద్ర‌బాబు మోదీపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని నానా యాగీ చేయడం, కేంద్రం సహకరించడం లేదని ప్రచారం చేయడం, మోదీ కంటే నేనే సీనియర్ అంటూ దెప్పిపొడవడం.. ఇవన్నీ అక్కడ రికార్డ్ అయ్యాయంట‌.

అందుకే బాబుకు ఇప్పుడు చుక్క‌లు చూపించేందుకు కేంద్రం రెడీ అయ్యింది. కొన్ని రోజులుగా రెండుతెలుగు రాష్ట్రాల్లో టీడీపీనేత‌ల‌పై ఐటీ దాడులు ఎంత సంచ‌ల‌నం సృష్టించాయో అంద‌రికీ తెలిసిందే. ఇక చంద్ర‌బాబుకు బినామీ అనే ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ దాడులు చేయ‌డంతో బాబు అండ్ కో వ‌ణికిపోతున్నారు. ఇది జ‌స్ట్ శాంపిల్ మాత్ర‌మే నంట‌….అస‌లు పిక్చ‌ర్ ముందుంది అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఐటీ దాడులు జ‌రుగుతున్నా అవ‌న్నీ కేంద్రం క‌క్ష‌తో చేయిస్తోంద‌ని మేక‌పోతు గాంభీర్యం మాట‌లు మాట్లాడుతున్నారు పార్టీ నేత‌లు. మోడీని ముందుంచి తెరవెనక అమిత్ షా రివేంజ్ డ్రామాని రక్తికట్టించే పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన కొన్ని కుంభకోణాల్ని కేంద్రం బయటపెట్టబోతోందని తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఒప్పందాలు, భూసేకరణలో జరిగిన అవినీతి, తాత్కాలిక నిర్మాణాల పేరుతో జరిగిన దోపిడీ, రుణమాఫీ పథకాల్లో లొసుగులు, అమరావతి బాండ్లు.. ఒకటేంటి, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి బండారాన్నంతా బయట పెట్టేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మొద‌టి నుంచి బాబు ప్ర‌భుత్వంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని విప‌క్షాలు కోడై కూస్తున్నాయి. భాజాపా, టీడీపీ క‌ల‌సి ఉన్నంత కాలం సైలెంట్‌గా ఉన్న కేంద్రం విడిపోయిన త‌ర్వాత ఇప్పుడు చుక్క‌లు చూపించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఒక ఎత్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి మరో ఎత్తు. ఇది భారీ కుంభకోణం అంటూ ఉండవల్లి వంటి నేతలు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర భాజాపా నేత‌లే పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని కేంద్రానికి ఆధారాల‌తో స‌హా వివ‌రించిన సంగ‌తి తెల‌సిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు జరిగిన ఐటీ దాడులు జస్ట్ ట్రైలర్ మాత్రమే అని తెలుస్తుంది. 2014లో జ‌గ‌న్‌కు ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందో అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు బాబు తప్ప‌దంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -