Friday, April 26, 2024
- Advertisement -

విజయ్​ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్​ అవుతుందా?

- Advertisement -

నాగచైతన్య.. శేఖర్​ కమ్ములతో చేసిన ‘లవ్​స్టోరీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఈ మూవీ రిలీజ్​ ఆగిపోయింది. ఇదిలా ఉంటే చైతూ ఆ తర్వాత మరో బాలీవుడ్​ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్​ అగ్రనటుడు అమీర్​ ఖాన్​ ప్రధానపాత్రలో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాను అద్వైత్ చందన్ డైరెక్ట్​ చేస్తున్నాడు. హాలీవుడ్ లో విజయం సాధించిన ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్​ వస్తున్నట్టు సమాచారం.

Also Read: ‘లవ్​స్టోరీ’ రిలీజ్​ ఎప్పుడంటే?

అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం గతంలో విజయ్​ సేతుపతిని సంప్రదించారట. తొలుత ఆయన ఒప్పుకున్నప్పటికీ.. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ చాన్స్​ నాగ చైతన్యకు దక్కింది. చైతన్య ఇటీవల విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ పాత్రను చైతు ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే విజయ్​ సేతుపతి దక్షిణాదిన గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ పాత్రకు చైతూ న్యాయం చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

‘ఫారెస్ట్ గంప్’ సినిమాలో మైకేల్టి విలియంసన్ పోషించిన ‘బుబ్బా’ అనే పాత్ర కోసం చైతన్యని తీసుకున్నట్లు తెలుస్తోంది. బుబ్బా చేసిన పాత్ర ఓ ఆర్మీ ఆఫీసర్​. అంటే నాగ చైతన్య ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్​గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాక.. జమ్మూ -కశ్మీర్​లో వరుస షూటింగ్​లో కూడా ఉండనున్నాయి. అయితే పాన్​ఇండియా మూవీగా రిలీజ్​ చేసేందుకు ఈ సినిమాలో దక్షిణాది స్టార్​కు ఈ మూవీలో చాన్స్​ ఇచ్చినట్టు సమాచారం. మరి ఆర్మీ ఆఫీసర్​ పాత్రలో చైతూ మెప్పిస్తాడా? అన్నది వేచి చూడాలి.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -