Friday, May 3, 2024
- Advertisement -

తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!

- Advertisement -

ఏపీలోని పలు చోట్ల బంగారు గనులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. రాయలసీమలోని పలు జిల్లాల్లో వజ్రాల వేట కూడా జోరుగా సాగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో అక్కడ వజ్రాల కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాయలసీమలోని ఓ ప్రాంతంలో బంగారు గనులు ఉన్నట్టు విదేశీ సంస్థ గుర్తించింది. ఇక్కడ బంగారం తవ్వి తీసేందుకు సదరు కంపెనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు ఇండో ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్స్ లిమిటెడ్(AIRL) ముందుకొచ్చింది.

ఇక్కడ బంగారు గనులను వెలికి తీసేందుకు సదరు కంపెనీ 2005 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ పర్యావరణ అనుమతులు రాకపోవడంతో ఆ సంస్థ పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని అనుమతులు దొరకడంతో ఇక అక్కడ బంగారు గనులను వెలికి తీయబోతున్నారు. ఇక ఏపీలోని జొన్న గిరి ప్రాంతం పేరు దేశ వ్యాప్తంగా వినిపించబోతున్నది.

Also Read: మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

ఈ ప్రాజెక్టుకోసం ఆ సంస్థకు 1500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 350 ఎకరాలు కొనుగోలు చేసింది. మరో 1150 ఎకరాలను లీజు కింద కంపెనీ తీసుకోనుంది. ఈ తొలిబ్లాక్‌లో ముందుగా బంగారు గనుల తవ్వకం ప్రారంభించిన తర్వాత మరో మూడు బ్లాకుల్లో మైనింగ్ చేయాలని AIRL సంస్థ నిర్ణయించింది. ఇక్కడ 30 నుండి 40 టన్నుల బంగారు నిక్షేపాలను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థ ప్రతి ఏడాది 750 కిలోల బంగారాన్ని వెలికి తీయాలని భావిస్తున్నది. అయితే ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకొనున్నది. తదితర వివరాలు తెలియాల్సి ఉన్నది.

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -