500, 1000 నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా 2000, మళ్లీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తోంది. అయితే ఈ నోట్లను ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో అనే విషయం కూడా ఆసక్తికంగా మారింది. అయితే ఈ కొత్త 500 రూపాయల నోటు ను ముద్రించాలంటే రూ. 3.09, 2000 రూపాయల నోటు ముద్రించాలంటే రూ. 3.54 చొప్పున ఖర్చు అవుతోందట.
ఈ సంగతిని రిజర్వు బ్యాంకు తరఫున నోట్లు ముద్రించే భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్) సంస్థ తెలిపింది. ఇది రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ. వెయ్యి 500 రూపాయల నోట్లను ముద్రించాలంటే.. మొత్తం రూ. 3090 ఖర్చవుతుందని, అలాగే వెయ్యి 2000 రూపాయల నోట్లను ముద్రించాలంటే రూ. 3540 ఖర్చుఅవుతుందని బీఆర్‌బీఎన్ఎంపీఎల్ చెప్పింది.
మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ని రెండు నంబర్ ప్యానళ్లలోను ‘ఆర్’ అనే అక్షరంతో విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు సోమవారం ప్రకటించింది. అతి త్వరలోనే కొత్త 50 రూపాయల నోట్లను కూడా రిలీజ్ చేస్తామని.. అయితే పాత 50 రూపాయల నోట్లను రద్దు చేసేది లేదని రిజర్వు బ్యాంకు చెప్పింది.
Related