Monday, May 6, 2024
- Advertisement -

800 టన్నుల నోట్ల‌ను హార్డ్‌బోర్డులుగా మార్చిన వెస్ట్ర‌న్ ఇండియ‌న్ ప్లైవుడ్ లిమిటెడ్‌…

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెలానీలో ఉన్న నోట్ల‌ను ర‌ద్దు చేసి సంచ‌ల‌నం సృష్టించారు. నోట్ల‌ను ర‌ద్దుచేసి రేప‌టికి ఏడాది పూర్త‌వుతోంది. నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డంతోపాటు అవినీతి త‌గ్గుతాద‌ని సెల‌విచ్చారు. రద్దయిన కరెన్సీలో 99 శాతం తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చేరిందని ఆర్‌బీఐ తెలిపింది.

నోట్ల ర‌ద్దుతో దేశ‌ప్ర‌జ‌లంద‌రు ఎలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన్నారో అంద‌రికి తెలిసిందే. దేశ‌ప్ర‌జలంతా లైన్లోలో నిల‌బ‌డి మ‌రీ త‌మ ద‌గ్గ‌ర‌నున్న నోట్లను బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేశారు. అవిష‌యాన్ని అటుంచితే డిపాజిట్ చేసిన నోట్ల‌న్నీ ఏమ‌య్యాయి,వాటిని ఏంచేశారు అనే ఆస‌క్తి అంద‌రిలోను ఉంటుంది. ఇంత‌కీ అవ‌న్నీ ఎక్క‌డ ఉన్నాయో తెలుసా… ద‌క్షిణాఫ్రికాలో. అదేంటి ద‌క్షిణాఫ్రికాలో అనుకుంటున్నారా మీరు విన్న‌ది నిజ‌మే. 2019లో అక్క‌డ జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఈ నోట్లే కీల‌కపాత్ర పోషించ‌బోతున్నాయి. కానీ క‌రెన్సీ రూపంలో కాదు… హార్డ్‌బోర్డుల రూపంలో.

అవును… పాత నోట్ల‌న్నింటినీ రీసైకిల్ చేసి ప్ర‌చారం కోసం ఉప‌యోగించే హార్డ్‌బోర్డ్‌లుగా మార్చినట్లు కేర‌ళ‌లోని క‌న్నూర్ ప్రాంతంలో ఉన్న వెస్ట్ర‌న్ ఇండియ‌న్ ప్లైవుడ్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. త‌మ ద‌గ్గ‌రికి దాదాపు 800 ట‌న్నుల పాత నోట్లు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి వ‌చ్చాయ‌ని, వాట‌న్నింటినీ హార్డ్‌బోర్డులుగా మార్చి ద‌క్షిణాఫ్రికా పంపించినట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పి. మెహ‌బూబ్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -