Sunday, May 19, 2024
- Advertisement -

పాత నోట్లను RBI ఏం చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు!

- Advertisement -
where is old notes

ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. ఆ నోట్లను బ్యాక్ లో వెసుకోమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరి బ్యాంక్ కు ఈ పాత నోట్లను తీసుకొని ఏం చేస్తోంది? అసలు ఈ పాత 500, 1000 నోట్లను ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఏం చేస్తున్నారో తెలుస్తే షాక్ కావాల్సిందే.

RBI బ్యాంకులకు వచ్చిన 8 లక్షల కోట్ల రూపాయలను పిండి పిండి చేస్తోంది. గతంలో రద్దైన నోట్ల కాల్చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయడమ్ లేదు. వాటిని ఏదో రకంగా రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనలతో.. అట్టలుగా మారుస్తోంది RBI తిరువనంతపురం శాఖ. తమ శాఖకు వద్దకు వచ్చిన కోట్లాది పాత నోట్లను పిండి చేసి అట్టలుగా మారుస్తున్నారు. ఈ పనిని కేరళలోని ది వెస్టర్న్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అందించింది. బస్తాల కొద్దీ నోట్ల మూటలను ఓ క్రషింగ్ మిషన్ లో వేస్తారు. అవి అతి చిన్నచిన్న ముక్కలుగా చేస్తోంది.

చిన్నగా అయిన ముక్కలను చూస్తే నిన్నటి వరకు మనిషిని శాసించిన నోటేనా అనే ఆశ్చర్యం రాక మానదు. ఇక ముక్కలు గా చేసిన ఈ నోట్లను గుజ్జుగా చేస్తారు. ఆ గుజ్జును అట్టల తయారీకి ఉపయోగిస్తున్నారు. 1962లో ఈ కంపెనీని స్థాపించారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అయినా.. తమ ఇంజినీర్లు తక్కువ వ్యయంలో నోట్లను పొడిగా మార్చే యంత్రాలను రూపొందించారని తెలిపారు కంపెనీ అధికారులు.

Related

  1. పాత 500 నోట్లు ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు!
  2. నోట్ల రద్దు 11 మంది బ్యాంక్ స్టాఫ్ ని చంపేసింది
  3. జర జాగ్రత్త.. గురూ.. ఏటీఎంల నుంచి రంగు వెలసిన నోట్లు!
  4. నోట్ల రద్దు వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -