Monday, April 29, 2024
- Advertisement -

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

- Advertisement -

తెలంగాణాలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు.. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా అక్కడ ప్రచార పర్వం ఇప్పటికే మొదలైపోయింది చెప్పొచ్చు. అన్ని పార్టీ లు తమ తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోగా అభ్యర్థుల ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.. అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం..

ఇక స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు. ఇందుకోస ప్రత్యేకంగా అసెంబ్లీని కూడా సమావేశపర్చాలని అనుకుంటున్నారు. అక్టోబర్ 13న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను, 14న కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

డిసెంబర్ లోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలనీ కేసీఆర్ భావిస్తుండగా దీని కావాల్సిన కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది.. ఈ ఎన్నికల్లో మొదటినుంచి కేసీఆర్ తలచినట్లు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగించనున్నారు.. అయితే ఎప్పుడు ఈవీఎం లు ఉపయోగించే ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు ఈ పద్ధతి ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం అందరు కరోనా అనుకున్నారు కానీ అది కాదని తెలుస్తుంది.. ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించడానికి అసలు కారణం ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు.. బీజేపీ పార్టీ తప్పా అన్ని పార్టీ ఈవీఎం ను వద్దని కోరగా కేసీఆర్ గట్టి పట్టు తోనే బ్యాలెట్ పద్ధతిని వాడబోతున్నట్లు తెలుస్తుంది..

హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతం వర్క్ అవుట్ అయ్యేలా ఉందే..?

కేసిఆర్ దుబ్బాక లో ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా..?

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -