ర్యాగింగ్, అమ్మాయిలపై బలత్కారాలు.. చాలా ఎక్కువ అయ్యాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నా… అవగాహన చర్యలు చేపడతున్నా.. నిర్భయ చట్టం వంటి కేసులు నమోదు చేస్తున్నా ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గుముఖం పట్టడం లేదు. ర్యాగింగ్ జాడ్యంలో భాగంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల చేత దారుణమైన పనులు చేయిస్తున్నారు. అయితే.. రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో ఓ విద్యార్థినిని ఇటీవల ర్యాగింగ్ పేరుతో దుస్తులు విప్పించిన సంఘటన జరిగింది.
జోద్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చేరింది. అదే స్కూల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నీ అందాలను చూడాలని ఉంది బట్టలు విప్పమన్నారు. దీనికి ఆ విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆ విద్యార్థినిని బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి బట్టలు విప్పించారు. ఈ ఘటనతో బాధపడిన ఆ బాలిక తమ తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పి బోరున విలపించిందట.
ర్యాగింగ్ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థినిలపై తో పాటు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌లో రాష్ట్రంలో ఆల్రెడీ ర్యాగింగ్ చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇది కేవలం కాలేజీ విద్యార్థులకే పరిమితమైందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. స్కూల్ యాజమాన్యం ఆ ఐదుగురు విద్యార్థినులను సస్పెండ్ చేశామని, అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేపట్టి వివరాలు తెలియజేస్తామని స్కూల్ సెక్రటరీ స్పష్టం చేశారట.
Related