- Advertisement -

ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం!

- Advertisement -
government good news for the common people

ప్రస్తుతం దేశంలో చాలా ఎదుర్కొంటున్న సమస్యల్లో గుండె వ్యాధులు అగ్ర స్థానంలోకి వస్తున్నాయి. ఈ వైద్యానికి కావాల్సిన ఖర్చు కూడా లక్షల్లోనే ఉంటుంది. అయితే గుండెకు వచ్చే వ్యాధుల్లో వాల్స్ బ్లాక్ కావడం చాలా ప్రధానమైంది. హార్ట్ స్ట్రోక్ వచ్చేకంటే ముందు రక్తనాళాలు మూసుకుపోవడం తెలిసిందే. అలా మూసుకుపోయిన వాల్స్ కు స్టెంట్లు వేసి యాక్టివ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ బతకడు.

ఇది ఒకటి, రెండు రోజుల్లో జరగాలి. ఈ వైద్యానికి ఎంతలేదన్నా రూ.2-5 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషిని కాపడే ప్రయత్నం చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది. గుండెజబ్బు బాధితులకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయాన్ని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‍పీపీఏ) తాజాగా వెల్లడించింది. గుండె రక్తనాళాలు మూసుకుపోతున్న పరిస్థితుల్లో గుండెపోటు రాకుండా నిరోధించేందుకు ఉపయోగించే స్టెంట్ల రేట్లను పది రెట్లు తగ్గించేసింది.

ఫిబ్రవరి 13వతేదీ నుంచే స్టంట్ల రేట్లు తగ్గించి అమ్మాలని ఆదేశాలు:

* గతంలో స్టంట్ ధర: రూ60వేలు నుంచి రూ.2.5లక్షలు

* ఇప్పుడు: మందుపూత లేని(బేర్ మెటల్) స్టెంట్ ధర రూ.7,260.

* మందుపూతతో పాటు రక్తనాళాల్లో కరిగిపోయే(బయోరిసోర్బబుల్‍వాస్కులర్‍ స్కాఫోల్డ్) స్టెంట్ ధర రూ.29,600లు మాత్రమే. అంతకిమించి అమ్మడానికి లేదు.

* ఫిబ్రవరి 13వ తేదీనుంచే మార్కెట్ లో అమ్మకానికి ప్యాక్ అయి వచ్చిన స్టెంట్లకూ లేటెస్ట్ రేట్లే వర్తిస్తాయి.

* ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కొక్క స్టంట్ రేటు అమాంతం 85శాతం తగ్గిపోయింది. 

* ప్రతియేటా దేశవ్యాప్తంగా 16వేల కోట్ల రూపాయల స్టంట్ల వ్యాపారం సాగుతోంది. తయారీ పూర్తయిన ఓ స్టంట్ వినియోగదారుడికి చేరేలోపు 600-1200 శాతం ధర పెరుగుతోంది. 

* ఆసుపత్రులు రోగికి స్టెంట్ ను అమర్చినప్పుడు దాని ఖరీదు ఎంతో ఇక నుంచి తప్పనిసరిగా తెలపాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ నిర్ణయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. లేకపోతే స్టెంట్ల కొనుగోలులో భారీగా మోసపోయే ప్రమాదం ఉంది.

Related

  1. ఈ ముఖ్యమంత్రుల నెల జీతాలు తెలిస్తే షాక్ అవుతారు..!!
  2. మా ఆస్తులన్నీ పోయాయి.. రాజమాళి సంచలన వ్యాఖ్య!!
  3. మొబైల్‌ లో ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఇక మీద ఆ అవకాశం ఉండదు!!
  4. జయలలిత ఆసుప‌త్రి బిల్లు ఎంతంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -