Sunday, April 28, 2024
- Advertisement -

ఈ ముఖ్యమంత్రుల నెల జీతాలు తెలిస్తే షాక్ అవుతారు..!!

- Advertisement -
CM’s Monthly Salary

దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు  తమతమ రాష్ట్రాల్లో అభివృద్ది  జరగకపోవడానికి కారణం ఆర్ధిక వనరులు సరిపోయేంతగా లేవు అనే చెబుతుంటారు. కానీ వారు తీసుకునే నెల జీతాలు తెలిస్తే మాత్రం  నోరెళ్లబెట్టక తప్పదు. ఆశ్యర్యం కలిగించే విషయం ఏంటంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఆయన జీతం అక్షరాల నెలకు నాలుగు లక్షల 21 వేలు.

 ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కూడా నెలకు రెండు లక్షల యాభై వేలు జీతం.  ఇక విభజనతో ఖజానా ఖాళీ అయ్యిందని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు రెండు లక్షల నలభై వేలు పుచ్చుకుంటున్నారు. దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో బాబు  మూడో స్థానంలో ఉన్నారు.  ఏపీ ఎమ్మెల్యేలు కూడా లక్ష 25 వేలు తీసుకుంటున్నారు. ఇకపోతే తమిళనాడు మాజీ సీఎం దివంగత  జయలలిత ఒక్కరూపాయి తీసుకుంటుండగా, పశ్చిమ బెంగాల్ దీదీ  అసలు అది కూడా పుచ్చుకోవట్లేదట. ఇక ఉత్తరాఖండ్ సీఎం రెండు లక్షల 50 వేలు తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌  సీఎం  రెండు లక్షలు, మహారాష్ట్ర సీఎం 2 లక్షల 25 వేలు తీసుకుంటుండగా ఢిల్లీ సీఎం లక్షా ఇరవై వేలతో సరిపెట్టుకున్నారు.  మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కేసిఆర్ రికార్డు కెక్కితే బెంగాల్ దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎంగా పనిచేస్తూ  ఆదర్శంగా నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -