పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మీద బిజినెస్ ఇంకా మొదలు అవ్వక ముందే ౩౦ సెకండ్స్ నిడివి గల టీజర్ విడుదల అవ్వడంతో మొత్తం లెక్కలు మార్చేసింది. పవర్ స్టార్ మాస్ లుక్స్, యాక్షన్ ఎన్నో రికార్డ్స్ తిరగరాసింది. దాంతో ఈ సినిమా మీద అంచనాల్ని కూడా అమాంతం పెంచేసింది. ఎవరు ఊహించని రెంజ్ లో కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.
ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ స్థాయిలో.. పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటి కంటే ఎక్కువగా ఈ సినిమాపై డబ్బులు పెట్టేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాం హక్కులను నితిన్ అండ్ ఏషియన్ ఫిలిమ్స్ కలిసి 20 కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. సీడెడ్ రైట్స్ ఏకంగా 12 కోట్లు పలికాయి. ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో 8.3 కోట్లు ముట్టాయి. గుంటూరు రైట్స్ కోసమే 6.5 కోట్లు దక్కాయంటే.. పవన్ పవర్ మరియు స్టామినా ఏ రేంజ్ లో ఉందో దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈస్ట్ 5.5 కోట్లు.. వెస్ట్ గోదావరి 4.85 కోట్లకు సేల్ అయ్యాయని సమాచారం. ఇక ఓవర్సీస్ సంగతికి వస్తే.. కాటమరాయుడును 12 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే పవన్ 85 కోట్లు బిజినెస్ చేసేశాడు. ఇక శాటిలైట్.. ఇతర హక్కులు కలిపితే.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ చిత్రం కాటమరాయుడు 100 కోట్ల మార్క్ ను దాటేసినట్లే అనే విశ్లేషకులు అంటున్నారు. సో ఏదు ఏమైనా.. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ మరోసారి తన పవర్ చూపించారు.
Related
