ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి… వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశం పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త నోట్ల కోసం సామన్య జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ఏటీఎం లు పనిచేయకపోగా… మరి కొన్ని చోట్ల పని చేసిన… అన్ని పెద్ద నోట్లే వస్తున్నాయి.
వాటితో చిల్లర దొరకాక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎం ముందు ఈ కొత్త నోట్లు పొందుతున్న ప్రజలు గంటల తరబడి లైన్లలో నిల్చొని తిప్పలు పడుతున్నారు. తీర ఈ ఏటీఎంల నుంచి వచ్చిన నోట్లు.. రంగు వెలసిన నోట్లు వస్తుండటంతో జనం విస్తుపోతున్నారు. అయితే ముంబయిలోని హెడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి నోట్లు పొందిన సుధీర్ శాండిల్యా అనే వ్యక్తికి పూర్తిగా రంగు వెలసిన రూ.500 నోట్లు వచ్చాయి.
దాంతో సుధీర్ కి ఏం చేయాలో అర్ధంకాక ట్విట్టర్‌లో తన గోడు వెల్లబుచ్చుకున్నాడు. దీంతో, రంగు వెలిస్తేనే ఒరిజనల్ నోట్లా? వీటికంటే నకిలీ నోట్లే బెటర్ అనే కామెంట్లు వినపడుతున్నాయి. ఇక ఈ 2వేల నోటు కూడా కలర్ వెలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ రంగు వెలసిన నోట్ల గురించి ఏం జవాబు బెబుతుందో చూడాలి. అయితే.. ఈ రంగు వెలసిన నోట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్పందించింది. ఆ నోట్లపై తమకు ఫిర్యాదు చేయాలని ట్విట్టర్‌లో వెల్లడించింది.
Related