Wednesday, May 15, 2024
- Advertisement -

ముద్ర‌న‌ను నిలిపి వేసిన ఆర్బీఐ

- Advertisement -

దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పెద్ద నోట్ల ర‌ద్దును తీసుకొచ్చి విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు. నోట్ల స‌మ‌స్య‌ను తీర్చేందుకు రూ.2000 నోటును తీసు కొచ్చారు. దీనిపైన దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి .న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టాలంటె పెద్ద నోట్లు అవ‌స‌రంలేద‌ని దాని బ‌దులు చిన్న‌నోట్లు తీసుకొస్తే ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటుంద‌ని వాద‌న‌లు దేశ వ్యాప్తంగా వినిపించాయి
కేంద్ర ప్ర‌భుత్వంకూడా ఆదిశ‌గా ఆలోచించి నిర్న‌యం తీసుకుంది.గ‌త డిసెంబ‌ర్ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన రూ. 2000 నోట్ల ముద్ర‌ణ‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపి వేసిన‌ట్లు స‌మాచారం. ఐదు నెల‌ల క్రితం నుంచి కొత్త‌గా రూ. 2000 నోట్ల‌ను ముద్రించ‌లేద‌ని, వీటికి బ‌దులుగా త్వ‌ర‌లో ప్ర‌వేశ పెట్ట‌బోయే రూ. 200 నోట్ల ముద్ర‌ణ‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.
అయితే పెద్దనోట్ల కారణంగా చిల్లర సమస్య తలెత్తింది. పెద్ద నగదు నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్న తరుణంలో చిల్లర నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో చిన్న నగదు ప్రింటింగ్‌పై ఆర్‌బిఐ కేంద్రీకరిస్తోంది.
ఆగ‌స్టు నుంచి అమ‌ల్లోకి రానున్న రూ. 200 నోట్ల‌ను మైసూర్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్బీఐ ముద్రిస్తోంది. నిజానికి వీటిని మార్చిలోనే ప్ర‌వేశ‌పెట్టాలి. కానీ భ‌ద్ర‌తాప‌ర‌మైన చెకింగ్‌లు, నాణ్య‌త‌ ప‌రీక్ష‌ల్లో జాప్యం వ‌ల్ల ప్రవేశ‌పెట్ట‌లేక‌పోయారు. గ‌తేడాది పెద్ద నోట్ల ర‌ద్దు మూలంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో న‌గ‌దు కొర‌త ఏర్ప‌డింది. దీన్ని తీర్చ‌డానికి చిన్న డినామినేష‌న్ల నోట్ల ముద్ర‌ణ‌కు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు మొగ్గు చూపుతోంది.
ఇప్ప‌టికే ముద్రించిన రూ. 2000 నోట్లు ద్ర‌వ్య మార్కెట్‌లో అధికంగా చ‌లామ‌ణిలో ఉండ‌టంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త‌గా రూ. 2000 నోట్ల‌ను ముద్రించే యోచ‌న‌లో ఆర్బీఐ లేన‌ట్లు సమాచారం. దీని వ‌ల్ల చిల్ల‌ర స‌మ‌స్య తీరె అవ‌కాశం.

https://www.youtube.com/watch?v=8RVKxnwBQeU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -