Sunday, June 16, 2024
- Advertisement -

మన ఫేస్ బుక్ అకౌంట్ తో ఫేస్ బుక్ కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా…

- Advertisement -
How Much Facebook is generating from your FB accounts

ప్రస్తుత రోజుల్లో  చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఫేస్ బుక్ లను వాడేస్తున్నారు.  చివరికి ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఫేస్ బుక్ ని వాడేస్తున్నారు. దాదాపుగా ఫేస్ బుక్ లో ఉండేవారందపూ  పక్కనున్న మనుషులని వదిలేసి ఫేస్ బుక్ లోనే మునిగిపోతున్నారు మనం ఎక్కడ ఉన్నది ఇంట్లో వాళ్లిక తెలియకపోయినా ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ కి మాత్రం తెలిసిపోతుంది.

 అంతల మనుషులు దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఇంత పిచ్చిగా    జనాలు ఫేస్ బుక్ వాడుతుండటంతో  ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు అయిన మార్క్ జుకర్ బర్గ్ కోట్లాది సంపద వచ్చి పడుతుంది.  కేవలం ఆరేడు సంవత్సరాల్లోనే   వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్స్ లో  ఆరో స్థానంలో నిలిచాడు జూకర్ బర్గ్. మనం వాడే ఫేస్ బుక్ ఎకౌంట్ల ద్వారానే జూకర్ బర్గ్ అంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

కేవలం  ఒక్క ఎకౌంట్ ద్వారా ఫేస్ బుక్ కంపెనీ సంవత్సరానికి 1056 రూపాయలను సంపాదిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి.  అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క వేసుకోండి. లెక్కపెట్టడం కాస్త కష్టంగా ఉంది కదూ.  మనం టైం పాస్ కోసమని వాడే ఫేస్ బుక్ ఒక కంపెనీకి అన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.

{youtube}WQ-PPFiS-_I{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -