తాజా జియో ఫోన్ ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో జియో ఫోన్ ను ఎప్పుడు అందుకుందామా అని అందరు ఎదురు చూస్తున్నారు. రూ.1500 పెట్టి ఫోన్ కొనండి.. మూడేళ్ల తర్వాత తిరిగి రూ.1500 వాపస్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మార్కట్లోకి లక్షల్లో ఫోన్లను విడుదల చేస్తారని తెలిపారు. మేడిన్ ఇండియా అంటూ ఇప్పుడు వస్తున్న జియో ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఆగస్ట్ 24 నుంచి ఆన్ లైన్ బుకింగ్ లు స్టార్ట్ అవుతాయి.
ఇంతకూ ఈ ఫోన్ ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మై జియో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో కూడా బుక్ చేయొచ్చు. అలా కూడా కుదరకుంటే.. 1860-893-3333 ద్వారా కూడా కొనవచ్చు. అయితే ఇలా బుకింగ్ చేసుకోవాలంటే ఆగస్ట్ 24 వరకు వేచి ఉండాలి. బుకింగ్స్ ఓపెన్ అయ్యాక.. సెప్టంబర్ నుంచి బహిరంగ మార్కెట్ లో ఫోన్లు దొరుకుతాయి. సో ఫోన్ కావాలంటే.. స్టోర్ లేదా ఆన్ లైన్ లో పొందొచ్చు.