Sunday, April 28, 2024
- Advertisement -

మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే.. ఇవి గుర్తుంచుకోండి !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మొబైల్ చేతిలో లేనిదే రోజు గడవని పరిస్థితి. అంతలా మనం మొబైల్ కు అడిక్ట్ అయ్యాం. అయితే మొబైల్ ను ఎక్కువ రోజులు వాడడం వల్ల దాని పర్ఫామెన్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మొబైల్ ను రీసెట్ చేస్తూ ఉంటాము. ఇంక కొన్ని సందర్భాలలో మొబైల్ రీసెట్ చేసినప్పటికీ దాని పర్ఫామెన్స్ స్లోగానే ఉంటుంది. అలాంటప్పుడు మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ అప్డేట్ వచ్చి ఉంటే వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటాము. అయితే అన్నీ సందర్భాల్లో మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం మంచిది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు..

మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల కొత్త ఫీచర్లతో పాటు కొత్త బగ్స్ కూడా మొబైల్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ బగ్స్ వల్ల మొబైల్ మరింత స్లో అవ్వడం ఖాయం. అలాంటప్పుడు ఆ బగ్స్ ను ఫిక్స్ చేసే అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదు. అందువల్ల మొబైల్ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయకుండా.. దానియొక్క కమ్యూనిటీ ఫామ్ లో ఏ ఏ కొత్త ఫీచర్లు వచ్చాయో చూసుకొని, అవి మీకు ఎంతవరకు ఉపయోగ పడతాయో తెలుసుకొని ఆ తరవాత అప్డేట్ చేయడం ఉత్తమం అని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొబైల్ అప్డేట్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహించాలని అప్పుడే మీ మొబైల్ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read

మీ ఫోన్ బ్లూటూత్ తో.. పెను ముప్పే !

ఇంటర్నెట్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా !

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -