Sunday, April 28, 2024
- Advertisement -

ఉదయం లేవగానే మొబైల్ చూస్తున్నారా.. జాగ్రత్త !

- Advertisement -

ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ యుగంలో మొబైల్ లేనిదే జీవితం గడవలేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ పోన్ అనేది మన రోజు వారి జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని, నైట్ పడుకునే వరకు స్మార్ట్ పోన్ తోనే కాలం గడిపేస్తూ ఉంటాము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ క్లాసెస్, గేమ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు అవసరం అయ్యే ప్రతి పని కూడా మొబైల్ తోనే ముడిపడి ఉంది. అందుకే మొబైల్ ఒక్క అరగంట మన చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ రాక మానదు. మరి అలాంటి మొబైల్ వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ తో అధిక సమయం గడపడం పలు రకాల అనర్తలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూస్తూ ఉంటారు చాలా మంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయం లేవగానే మొబైల్ చూడడం వల్ల వచ్చే అనర్థలేవో ఒక్కసారి తెలుసుకుందాం !

చాలమందికి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూడడం ఒక అలవాటుగా ఉంటుంది. అలా చేయడం వల్ల మొబైల్ కు సంబంధించిన లైటింగ్ నేరుగా కళ్లపై పడి పలు రకాల కంటి సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే రాత్రంతా పడుకున్న తరువాత ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరచి వెంటనే మొబైల్ చూస్తే.. మొబైల్ లైటింగ్ వల్ల కళ్ళు మండడం జరుగుతుంది. ఫలితంగా సున్నితమైన కంటిలోని బాగాలు ఎరుపు రంగులోకి మారుతాయి. ఇదిలాగే కొనసాగితే త్వరగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉదయం మొబైల్ చూడడం వల్ల మెదడుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందట. రోజంతా అలసత్వం, ఏకాగ్రతతో పని చేయలేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూసే అలవాటు ఉంటే వెంటనే విరమించుకోవాలని, సాధ్యమైనంత వరకు మొబైల్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మొబైల్ పైన గీతాలు పడ్డాయా.. అయితే ఇలా చేయండి !

మొబైల్ ఫ్యాంట్ జోబిలో పెడుతున్నారా.. జాగ్రత్త !

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -