Sunday, April 28, 2024
- Advertisement -

ఫోన్ బాత్‌రూం లో వాడితే జరిగేది ఇదే…

- Advertisement -

ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా స్మార్ట్ ఫోన్‌ల మ‌యం. బిచ్చ‌గాడి ద‌గ్గ‌ర‌నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కు నిత్యం స్మార్ట్ ఫోన్‌నె ఉప‌యేగిస్తుంటారు. ఎందాక వెల్లిందంటె స్మార్ట్ ఫోన్ లేకుండా .. రోజు గడవదు.. ఎక్కడికెళ్లినా ఏం చేసినా ఫోన్ ఉండాల్సిందే. ప్రస్తుతం ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఉద‌యంలేవ‌గానె ముందుగా చూసెది స్మార్ట్ ఫోన్‌నె.

ఫేస్‌బుక్‌లో పోటోలు పెట్టాల‌న్నా,వాట్స‌ప్, స్నేహితుల‌తో మాట్లాడ‌ల‌న్నా ఉండాల్సిందె. మ‌నిషి ఎంత‌లా బానిస అయ్యాడంటె చివ‌రికి బాత్‌రూంలో ఫోన్‌ను వ‌ద‌ల‌డంలేదు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా. అక్క‌డికె వ‌స్తున్నా.

బాత్ రూంలో ఫోన్ వాడ‌టం చాలా ప్ర‌మాద‌రం. అలాంటి అల‌వాటు ఉంటె ఇక నుంచైనా మానుకోండి లేకుంటె రోగాల‌బారిన ప‌డ‌టం ఖాయం. మనం చేసే చాటింగులు, ఫేస్‌బుక్‌ కాసేపు పక్కనపెడితే మీ ఆరోగ్యానికి ఏ మాత్రం ఢోకా ఉండదు. బాత్‌రూంలో ఉండే బ్యాక్టీరియా నేరుగా కంటే ఫోన్‌ మీదకు ఎక్కువ వ్యాపిస్తుంది. మీరు చేతులు శుభ్రపరచుకున్న బాత్‌రూంలోకి తెచ్చుకున్న ఫోన్‌ను ముట్టుకోవడం ద్వారానే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుందని తెలిసింది.

ఇక పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. పలురకాల బ్యాక్టీరియా ఫోను ద్వారా వ్యాప్తి చెంది అనారోగ్యం పాలయ్యే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతంది. ఇక‌నైనా బాత్ రూంలో ఫోన్ వాడె అల‌వాటు ఉంటె మానుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -