Thursday, May 8, 2025
- Advertisement -

జియో – ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల లెక్క ఇదే!

- Advertisement -
jio airtel users calculation is shocking

జియో… ఓ రికార్డ్ గా మరింది. డిసెంబరు తో ఆఖరు అనుకున్న భపడిన జియో యూజర్లకు జియో అధినేత ముఖేష్ అంబానీ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ.. అంటూ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఫ్రీ ఇచ్చేశారు.

ఉచిత కాల్స్‌, ఉచితంగా మొబైల్‌ డేటా… వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. జియో ద్వారా ఇండియ‌న్ టెలికం రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టిన రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో ఉచిత వెల్ కం ఆఫ‌ర్‌ను పొడిగించారు. తాజాగా ఆయ‌న రిలయన్స్‌ వినియోగదారులు, సిబ్బందిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో ఈ ఉచిత వెల్ కం ఆఫ‌ర్‌ను వ‌చ్చే యేడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం, దేశాన్ని డిజిటల్‌ లావాదేవీల దిశగా నడిపించాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో ముకేష్ ఫ్రీ ఆఫ‌ర్‌కు మ‌రింత ప్రాధాన్యం ల‌భించింది. ఇక జియో ఆఫ‌ర్ మొదలు పెట్టిన 83 రోజుల్లోనే 5.2 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకున్నామని ముకేష్ ఘనంగా ప్రకటించారు. రోజు ఆరు లక్షల మంది జియో వినియోగదారులుగా మారితున్నారి చెప్పారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను మించిన వేగంతో తాము విస్త‌రిస్తున్నామ‌ని కూడా చెప్పారు.

ఇక ఎయిర్‌టెల్ యూజ‌ర్ల లెక్క చూస్తే… 

జియోకు కేవ‌లం 83 రోజుల్లోనే 5.2 కోట్ల మంది వినియోగ‌దారులు దేశ‌వ్యాప్తంగా ఉంటే.. ఎయిర్‌టెల్‌కు ఇప్పటివరకు దేశ‌వ్యాప్తంగా 28 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు. మ‌రి జియో వెల్ కం ఆఫ‌ర్ పొడిగించిన క్రమంలో జియో వినియోగ‌దారులు మ‌రింత భారీగా పెర‌గ‌నున్నారు.

Related

  1. అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించిన జియో అధినేత ముకేష్ అంబానీ
  2. BSNL ఆఫర్ తో జియో కి దిమ్మతిరిగింది!
  3. జియో వినియోగ‌దారులకు మరో దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్‌!
  4. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -