- Advertisement -

ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!

- Advertisement -

కన్నడ ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో రిషి . ఇతడు నటించిన మొదటి బ్లాక్‌బస్టర్‌ కన్నడ మూవీ “ఆపరేషన్‌ అలమేలమ్మ ” ఈ మూవీలో రిషి జంటగా శ్రద్ధ శ్రీనాథ్‌ నటించింది. హీరోగా రిషి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని నమోదు చేయడంతో కన్నడ ఇండస్ట్రీలో వరుసగా కావలు దారీ, సర్వజనికారిగే సువర్ణవాకాషా,శ్రీ భరత బాహుబలి వంటి సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

కన్నడ యువ హీరో రిషి 2019 సంవత్సరంలో తమిళమ్మాయి స్వాతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ జంట తమ ప్రేమ కథ గురించి ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.స్వాతి మాట్లాడుతూ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లాను.ఓరోజు కాలక్షేపం కోసం నగరంలోని ఓ డ్రామా థియేటర్‌కు వెళ్లాగా మొదటిసారి రిషిని స్టేజ్‌పై చూశాను.ఎంతో అందంగా చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు. విరామ సమయంలో రిషిని కలిసి మీ నటన చాలా బాగుంది అని చెప్పాను.ఇంటికి రాగానే ఫేస్‌బుక్‌లో అతని గురించి సెర్చ్‌ చేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాను. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

Also read:నాకు కార్తీకదీపం నచ్చదు.. డాక్టర్ బాబు భార్య వైరల్ కామెంట్స్!

రిషి ఇంకా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రిషి మొదటి చిత్రం అద్భుత విజయం సాధించడంతో నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నీకు ఇష్టమేనా అని అడిగాడు. నేను సరే అనడంతో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాం. మా జీవితం హ్యాపీగా సంతోషంగా సాగుతోంది అంటూ స్వాతి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. దీనికి కొంత మంది నెటిజెన్స్ మీ ప్రేమ అద్భుతం మీ కన్నడ ప్రేమను చిత్రంగా కూడా తీయొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మీ జంట జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటూ కొంతమంది విషెస్ తెలుపుతూ కామెంట్ పెట్టారు.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -