Monday, May 13, 2024
- Advertisement -

మీరు కూడా గాల్లో ఎగ‌రొచ్చు…

- Advertisement -
Kitty Hawk Flyer is an ultralight flying machine for you…

గాలిలో ఎగుర‌తూ ఒక ప్రాంతంనుంచి ఇంకోప్రాంతానికి వెల్ల‌డం……అవ‌స‌రం అయిన‌పుడు నీటిలో దూసుకెల్ల‌డం ..చిన్న చిన్న‌వాహ‌నాల‌వెల్ల‌డం ఇవన్నీ పాత పౌరానికి చిత్రాల‌లో చూసి ఎంజాయ్ చేశాం. మ‌నం కూడా అలా వెల్తే బాగుంటుంద‌నుకుంటున్నారా.అయితే ఇక చింతించాల్సిన అవ‌స‌రంలేదు. అక‌ల నిజం  చేసిందో కంపెనీ…

గాలిలో ఎగ‌రాల‌ని ప్ర‌తీ ఒక్క‌రికి ఆశ ఉంటుంది. ఒక వేల ఎగ‌రాల‌న్న ప్లైట్‌లో వెల్లి ఆఅనుభూతిని పొందాలి.కానీ ప్ర‌తీ ఒక్క‌రికి ప్లైట్ ఎక్కే స్తోమ‌త ఉండ‌దు. మ‌రి వీరంద‌రికోసం  ఈ కంపెనీ తయారు చేసిన వాహనం మీ చెంత ఉంటే.. ఇక గాల్లో ఎంచక్కా చక్కర్లు కొట్టొచ్చు. నీటిపై తేలియాడుతూ వెళ్లొచ్చు. సిలికాన్‌వాలీకి చెందిన ఫ్లైయింగ్‌ కార్‌ స్టార్టప్‌ కంపెనీ ‘కిట్టీ హాక్‌’ పర్సనల్‌ ఫ్లైయింగ్‌ మెషీన్‌ వాహనాన్ని రూపొందించింది.దీని ద్వారా సొంతంగా గాల్లో ఎగ‌ర‌చ్చు నీటిలో దూసుకెల్ల‌చ్చు. ఖ‌ర్చ‌కూడా  త‌క్కువే.

కిట్టీహాక్‌ కంపెనీ సోమవారం ఈ వాహనానికి సంబంధించిన ఎయిర్‌బోర్న్‌ ప్రొటోటైప్‌ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఓకే సీటు ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రదర్శించారు. ఓ సరస్సు నుంచి అది టేకాఫ్‌ అయి గాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూపించారు. 8 మోటార్లు కలిగి ఉన్న ఈ క్రాఫ్ట్‌ హెలికాప్టర్‌ మాదిరిగానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ అవుతుంది. 220 పౌండ్ల బరువుండే ఈ వాహనం గంటకు 25 మైళ్ల వేగంతో దూసుకెళ్తొంది. 15 మీటర్ల ఎత్తు వరకూ ఇది ఎగరగలుగుతుంది‘పర్సనల్‌ ఫ్లయింగ్‌ మెషీన్‌’ను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది.

దీని తయారీ వెనుక గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ మద్దతు ఉన్నట్లు సమాచారం.ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఫ్లైట్‌ ఉండాలనే కలను మేం నిజం చేయాలనుకుంటున్నాం. అందరూ వీటిని వాడితే పరిమితులు లేని సరికొత్త ప్రపంచం వారి ముందుంటుంది’ అని కిట్టీహాక్‌ కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది.

ఇది పూర్తిగా సురక్షితమైనదని, అన్ని రకాల ప్రయోగాలు చేపట్టినట్లు , అమెరికాలో రద్దీలేని కొన్ని ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు అనుమతి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వీటిని నడపడానికి పైలట్‌ లైసెన్స్‌ ఏదీ అక్కర్లేదని.. రెండు గంటల శిక్షణ సరిపోతుందని కంపెనీ చెబుతోంది. 2017 చివరినాటికి వీటిని అమ్మకానికి సిద్ధంగా ఉంచుతామని వెల్లడించింది.ఇక నుంచి ప్లైటు ఎక్క‌డానికి స్తోమ‌త లేని వాల్లుకోసం ఈకొత్త వాహ‌నం  ఆకోరిక‌ను తీరుస్తుంది. ఇంకెందుకు మీరు కూడా గాల్లో ఎగ‌ర‌డానికి సిద్దంగా ఉండండి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. వ‌చ్చే జ‌న్మ‌లో మీరు ఏజీవిగా పుర్తారో తెలుసుకోండి.
  2. ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
  3. పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి
  4. డాట‌రాఫ్ చాయ్ వాలా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -