Monday, May 13, 2024
- Advertisement -

ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి భారీ జరిమానా చెల్లించుకున్నాడు

- Advertisement -

ఒక హోటల్ పై ఫేస్ బుక్ లో అసభ్యకర కామెంట్లు పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా వ్యక్తికి అక్కడి కోర్టు భారీ జరిమాని విధించింది. ఆస్ట్రేలియాకు చెందిన 74 సంవత్సరాల రోథీకి రెండు హోటళ్లు ఉన్నాయి. కుటుంబ గొడవల కారణంగా ఇళ్ల నుంచి వచ్చేసిన పిల్లలకు తన హోటళ్లలో ఆశ్రయం కల్పించేవాడు. ఈవిధంగా చేయడాన్ని తప్పుబడుతూ, ఈ హోటళ్లపై అసభ్యకర కామెంట్లు చేస్తూ డేవిడ్ స్కాట్ అనే ఎలక్ట్రీషియన్ 2014లో తన ఫేస్ బుక్ ఖాతాలో కామెంట్లు చేశాడు.

చిన్నారులతో రహస్య వ్యభిచారం చేయిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ పోస్ట్ ల కారణంగా ఆ హోటల్ కు అర్థంపర్థం లేని ఫోన్ కాల్స్ వస్తుండేవి. ఈ విషయమై స్కాట్ క్షమాపణలు చెప్పాలని రోథీ కోరాడు. ఇందుకు స్కాట్ ససేమిరా అన్నాడు. రోథీకి బెదిరింపులు రావడమే కాకుండా, ఆయనపై భౌతిక దాడులు కూడా జరగడంతో ఆరు నెలల పాటు చికిత్స నిమిత్తం ఆసుపత్రికే పరిమితమయ్యాడు.

ఆ తర్వాత కోర్టును ఆశ్రయించిన రోథీ, జరిగిన విషయాలన్నింటిని పూసగుచ్చినట్లు కోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో హోటల్ యజమాని రోథీ కి పరువు నష్టం కల్గించిన స్కాట్ కు లక్షా యాభై వేల డాలర్ల జరిమానా విధించింది.

Related

  1. మీకు ఫేస్ బుక్ ఉందా ?
  2. ఫేస్ బుక్‍లో ఏ హీరోయిన్ నెంబర్ వన్ అంటే?
  3. ఫేస్ బుక్ ప్రేమ ప్రాణం తీసింది
  4. ఫేస్ బుక్ కామెంట్స్ చూసి స్యూసైడ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -